ఉండ‌వ‌ల్లితో భేటీ...? ఏపీలో ర‌స‌వత్త‌రం ? ఆ సీక్రెట్స్ ఏంటో ?

రాజ‌మండ్రి మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ రాజ‌కీయాల ప‌రంగా అంద‌రికి సుప‌రిచితుడు.రెండు సార్లు రాజ‌మండ్రి ఎంపీగా కూడా ప‌నిచేశారు.

కాంగ్రెస్ రాజ‌కీయాల్లోనూ సీనియ‌ర్‌గా పేరు తెచ్చుకున్నారు.వైఎస్సార్ పార్టీలోకి వ‌చ్చాక ఐదేండ్ల‌కు పైగా పార్టీకి వెన్ను ద‌న్నుగా నిలిచాడు.

వైఎస్ కుటుంబానికి అత్యంత స‌న్నిహితుడు కూడా.కుటుంబ ప‌రంగాను, రాజ‌కీయ పరంగాను స‌ల‌హాలు ఇచ్చే శ్రేయోభిలాషిగా పెరు తెచ్చుకున్నాడు.

వైఎస్ హ‌యాంలో ఆయ‌న ఒక వెలుగు వెలుగొందాడు.కానీ, వైఎస్సార్ మ‌ర‌ణం అనంత‌రం ఆయ‌న పొలిటిక‌ల్ గ్రాఫ్ చాలావ‌ర‌కు త‌గ్గిపోయింది.

2014లో రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం కాంగ్రెస్‌కు రాజీనామా చేసి ఎన్నిక‌ల రాజ‌కీయాల నుంచి త‌ప్పుకున్నారు.

అయితే త‌న అభిప్రాయాల‌ను మీడియా స‌మావేశాల్లో కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టు చెబుతుంటారు.ఏపీలో జ‌గ‌న్ కానీ, చంద్ర‌బాబు గానీ సీఎం గా ఉన్నా త‌న‌కు ప‌ట్టింపు లేద‌న్న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తుంటాడు.

రాష్ట్ర ప్ర‌యోజ‌నాలే త‌న‌కు ముఖ్య‌మ‌ని చెబుతుంటారు.సీఎం జ‌గ‌న్‌తో మాత్రం ఉండ‌వ‌ల్లి భేటీ అయింది ఇప్ప‌టి వ‌ర‌కు రెండు సార్లే కావ‌డం గ‌మ‌నార్హం.

ఈక్ర‌మంలో వైఎస్సార్‌పై హైద‌రాబాద్‌లో విజ‌య‌మ్మ స‌భ పెడితే హాజ‌రైన విష‌యం విధిత‌మే.కాగా క్రైస్త‌వ మ‌త ప్ర‌చార‌కుడు, వైఎస్సార్ అల్లుడు, వైఎస్పార్ టీపీ అధ్య‌క్షురాలు ష‌ర్మిల భ‌ర్త బ్ర‌ద‌ర్ అనిల్ రీసెంట్‌గా ఉండ‌వ‌ల్లిని క‌లిసి ర‌హ‌స్య చ‌ర్చ‌లు జ‌రిపారు.

దీంతో ఏపీల ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది.చాలా విష‌యాలు చ‌ర్చించుకున్నాం.

కొన్ని సీక్రెట్స్ ఉన్నాయి.వాటిని చెప్ప‌కూడ‌దంటూ అనిల్ మీడియాకు తెలిపి మ‌రింత ఆస‌క్తి పెంచారు.

ఉండ‌వ‌ల్లి కూడా అదే మాట చెప్ప‌డం, టైం చూసుకుని తానే వివ‌రాలు మీడియాకు తెలుపుతాన‌ని అన‌డం రాజ‌కీయంగా హాట్ టాపిక్‌గా మారింది.

ఉండ‌వ‌ల్లి నుంచి చాలా నేర్చుకోవాల‌ను కుంటున్నాన‌ని బ్ర‌ద‌ర్ అనిల్ పేర్కొన్నారు. """/" / అయితే వైఎస్ షర్మిల పార్టీకి ఎన్నిక‌ల సంఘం ఇటీవ‌ల గుర్తింపు ఇచ్చింది.

ఏపీలో కూడా వైఎస్సార్‌టీపీని ప‌టిష్ట‌ ప‌రిచేందుకు య‌త్నిస్తున్న‌ట్టు స‌మాచారం.ఈ క్ర‌మంలో జ‌గ‌న్ సీఎంగా ఉన్నాడు.

మ‌రి అత‌ని ప్ర‌భుత్వంపై ఏమి మాట్లాడ‌తారా ? ఏం నిర్ణ‌యాలు తీసుకోవాల‌ను కుంటున్నారు? ఉండ‌వ‌ల్లి అవ‌స‌రం ఏమేర ఉంది ? అనే అంశాలు చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి.

కుటుంబ ప‌రంగా జ‌గ‌న్‌కు, ష‌ర్మిల‌కు విభేదాలు ఉన్నాయ‌నే టాక్ గ‌తం నుంచే వినిపిస్తోంది.

దీనిని ప‌రిష్క‌రించేందుకు మ‌ధ్య‌వ‌ర్తిగా ఉండ‌వ‌ల్లిని ఉంచేందుకు కోరారా అనే ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి.లేదంటే సీఎం జ‌గ‌న్‌తో సంప్ర‌దింపులు ఏమైనా చేస్తారా ? అనే సందేహం త‌లెత్తుతోంది.

వైఎస్సార్‌టీపీలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించాల‌ని ఎవ‌రైనా కోరుతున్నారా ? ఇలా అనేక అనుమానాలు, సందేహాల‌కు వారి భేటీ చ‌ర్చ‌కు దారితీస్తోంది.

ఇద్ద‌రు ఉండ‌వ‌ల్లి, బ్ర‌ద‌ర్ అనిల్ భేటీ ర‌హ‌స్య విష‌యాలేంటో తెలియాలంటే అనిల్ మ‌రోసారి మీడియా స‌మావేశం పెట్టే వ‌ర‌కు వేచి చూడాలి.

కన్నప్ప సినిమాలో నటించడం మోహన్ లాల్ కి ఇష్టం లేదా..?