ఏపీలో సీట్ల మార్పుపై ఉండవల్లి కీలక వ్యాఖ్యలు
TeluguStop.com
ఏపీలో అధికార పార్టీగా ఉన్న వైసీపీలో అభ్యర్థులు, సీట్ల మార్పుపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు.
ఏపీలో అభ్యర్థులు, సీట్లను మార్చడం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేశారు.అభ్యర్థులను మార్చకుండా ఉండటం వలనే తెలంగాణలో కేసీఆర్ ఓడిపోయారన్న ఉండవల్లి అభ్యర్థులను మార్చితే జగన్ గెలుస్తారనుకోవడం సరికాదని చెప్పారు.
సీటు లేదని చెప్పాలంటే చాలా అనుభవం ఉండాలని పేర్కొన్నారు.అటువంటి అనుభవం జగన్ కు ఉందని తాను అనుకోవడం లేదన్నారు.
ఏపీలో ఎమ్మెల్యేలకు ఎక్కడా అధికారం లేదని తెలిపారు.అక్కడ అధికారం అంతా జగన్, వాలంటీర్లకు మాత్రమే ఉందని వెల్లడించారు.
తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు చక్కగా జరుగుతున్నాయన్న ఆయన అలాంటి పరిస్థితి ఏపీలో లేదని తెలిపారు.
ముఖంపై నల్ల మచ్చలను పోగొట్టే మోస్ట్ పవర్ ఫుల్ చిట్కాలు మీకోసం!