కేంద్రంపై ఉండవల్లి అరుణ్ కుమార్ మండిపాటు

విభజన హామీలను కేంద్రం అమలు చేయడం లేదని ఉండవల్లి అరుణ్ కుమార్ మండిపడ్డారు.

తొమ్మిదేళ్లలో కేంద్రం రూ.5 వేల కోట్లు కూడా ఇవ్వలేదని విమర్శించారు.

కేంద్రం చేస్తున్న అన్యాయాలను అప్పుడు చంద్రబాబు, ఇప్పుడు జగన్ పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

దేశ్ కీ నేత కేసీఆర్ ముందు ఏపీ పెండింగ్ అంశాలను సెటిల్ చేయాలన్నారు.

కేసీఆర్ జాతీయ నేత అవడానికి అడ్వాంటేజేస్ ఉన్నాయని చెప్పారు.పోలవరం అడ్డంకులను తొలగించేందుకు కేసీఆర్ ముందుకు రావాలని తెలిపారు.

తెలంగాణలో బీసీల నుంచి తొలగించిన ఏపీ కులాలను తిరిగి చేర్చాలని డిమాండ్ చేశారు.

అనపర్తి ఘటనను గతంలో ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్యనించారు.అనపర్తి ఘటన వలన ప్రభుత్వానికి వచ్చే మేలు కన్నా.

నష్టమే ఎక్కువని వెల్లడించారు.ఎన్డీఏ చేసిన అప్పులు.

గత ప్రధానులు ఎప్పుడూ చేయలేదన్నారు.అప్పులతో ఏం చేశారో కూడా బీజేపీ ప్రభుత్వం వివరణ ఇవ్వాలని కోరారు.

పర్ఫెక్ట్ ఫిమేల్ బాడీ ఉన్న యువతి ఈమెనట.. ఏఐ ఇంకేం చెప్పిందంటే..?