20 ఏళ్ళ క్రితం ఆసీస్ మెడలు వంచిన భారత్ .. ఇంకా ఆ అవమానాన్ని మర్చిపోలేకపోతున్నారు

అతి విశ్వాసం ఒక్కోసారి ఎలా కొంప ముంచుతుందో ఆత్మవిశ్వాసం అననుకున్న టార్గెట్ ను రీచ్ అయ్యేలా చేస్తుంది.

ఓ టెస్టు మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై భారత్ సాధించిన విజయాన్ని గమనిస్తే ఈ విషయం మరింత స్పష్టంగా అర్థం అవుతుంది.

కోల్ కతా వేదికగా 2001లో భారత్, ఆస్ట్రేలియా మధ్య టెస్టు మ్యాచ్ జరిగింది.

ఈ మ్యాచ్ లో భారత్ సాధించిన విజయం చరిత్రలలో మిగిలిపోతుందని చెప్పుకోవచ్చు.క్రికెట్ ఉన్నంత వరకు ఈ గెలుపు గుర్తుండిపోతుంది.

వరుసగా 16 టెస్టుల్లో విజయం సాధించి.దూకుడు మీదున్న ఆసీస్ జట్టు మదాన్ని అణిచింది భారత్.

కనివినీ ఎరుగని ఓటమి దెబ్బ ఎలా ఉంటుందో రుచి చూపించింది.స్టీవ్ వా కెప్టెన్సీలో ఆస్ట్రేలియా జట్టు భారత పర్యటనకు వచ్చింది.

అప్పటికి అన్ని ఫార్మాట్లలో కంగారు జట్టు మంచి ఫామ్ లో ఉంది.ఇదే సమయంలో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య కోల్ కతా వేదికగా టెస్టు మ్యాచ్ మొదలైంది.

ఆస్ట్రేలియా టాస్ నెగ్గింది.తొలుత బ్యాటింగ్ చేసింది.

తొలి ఇన్నింగ్స్ లో 445 రన్స్ చచేసింది.స్టీవ్ వా 110 పరుగులు చేయగా హెడెన్ 97 రన్స్ చేశాడు.

"""/"/ ఇదే మ్యాచ్ లో భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్ హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టాడు.

భారత బ్యాట్స్ మెన్లు మాత్రం వరుసబెట్టి వికెట్లు కోల్పోయారు.తొలి ఇనన్నింగ్స్ లో 171 పరుగులకే ఆలౌట్ అయ్యారు.

274 రన్స్ వెనుకంజలో ఉంది.ఫాలో ఆన్ కు దిగింది.

"""/"/ రెండో ఇన్నింగ్స్ లో కూడా ఇండియన్ టీమ్ కీలక వికెట్లను కోల్పోయింది.

ఈ సమయంలోనే యువ బ్యాట్స్ మెన్లు వివిఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రవిడ్ క్రీజ్ లోకి వచ్చారు.

ఇద్దరూ ఓ రేంజిలో ఆస్ట్రేలియా బౌలర్లలను చీల్చి చెండాడారు.లక్ష్మణ్ 281 పరుగులు చేశాడు.

ద్రవిడ్ 180 రన్స్ తో అదరగొట్టాడు.ఇద్దరూ కలిసి 376 పరుగులు చేసారు.

భారత్ 657/7 దగ్గర డిక్లేర్ చేసింది.ఆస్ట్రేలియా ముందు 384 పరుగుల టార్గెట్ ఉంచింది.

చివరి రోజు పిచ్ మీద బ్యాటింగ్ చేయడం అంత ఈజీ కాలేదు ఆస్ట్రేలియా జట్టుకు.

స్పిన్ బాగా తిరగడంతో ఆసీస్ బ్యాట్స్ మెన్లు వరుసబెట్టి ఫెవిలియన్ బాట పట్టారు.

భారత జట్టు చారిత్రక విజయం సాధించింది.

ప్రభుత్వానికి మద్దతుగా..  బొత్స అనుమానాస్పద వ్యాఖ్యలు