తెలుగులో మరే హీరోకు సాధ్యంకాని రికార్డు నాగార్జునకే సొంతం.. అదేంటో తెలుసా?

సినిమా పరిశ్రమ అన్నాక ఒక్కో హీరోకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది.అలాగే తెలుగు సినిమా పరిశ్రమలో నాగార్జునకే సొంతం అయిన ఓ రికార్డు ఉంది.

మిగతా నటులు ఆ విషయంలో తనకు దగ్గరగా కూడా లేరు.ఇంతకీ ఆయన సాధించిన రికార్డు ఏంటి? కథ ఏంటి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

దక్షిణాది సినిమా పరిశ్రమ నుంచి ఎక్కువ బాలీవుడ్ సినిమాలు చేసిన నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు నాగార్జున.

ఆయన కంటే ముందు రజనీకాంత్, కమల్ హాసన్ ఎక్కువ బాలీవుడ్ సినిమాలు చేశారు.

తెలుగు సినిమా పరిశ్రమ నుంచి ఎక్కువ బాలీవుడ్ సినిమాలు చేసిన వ్యక్తిగా నాగార్జున సత్తా చాటుకున్నాడు.

ఇక ఆయన బాలీవుడ్ సినిమాలు ఏంటో చూస్తే.ఆయన తొలి మూవీ శివ.

తెలుగులో హిట్ అయిన ఈ సినిమాను ఆర్జీవీ అదే పేరుతో బాలీవుడ్ లో రీమేక్ చేశాడు.

ఈ సినిమా అక్కడ కూడా మంచి విజయాన్ని అందుకుంది.ఆ తర్వాత అమితాబ్, శ్రీదేవి మూవీ ఖుదా గవాలో నటించి సక్సెస్ కొట్టాడు.

తెలుగులో ఆర్జీవీ తీసిన అంత మూవీని.హిందీలో ద్రోహి పేరిట తెరకెక్కించాడు.

ఈ సినిమా కూడా మంచి హిట్ సాధించింది.మహేష్ భట్ మూవీ క్రిమినల్ లోనూ నటించాడు.

యావరేజ్ గా నటించింది. """/"/ అటు భాగ్యరాజ్ దర్శకత్వంలో వచ్చిన మిస్టర్ బేచారాలో కూడా నటించాడు నాగార్జున.

ఇందులో అనిల్ కపూర్, శ్రీదేవి ప్రధాన పాత్రలు చేశారు.మహేష్ భట్ మరో మూవీ అంగారేలోనూ నటించాడు.

ఇందులో అక్షయ్ మెయిన్ హీరోగా చేశాడు.మహేష్ భట్ దర్శకత్వంలోనే అజయ్ దేవ్ గణ్ హీరోగా చేసిన జక్మ్సినిమాలోనూ నటించాడు నాగార్జున.

"""/"/ అగ్ని వర్ష అనే సినిమాలోనూ నటించాడు.కానీ అంతగా సక్సెస్ కాలేదు ఈ సినిమా.

అటు ఎల్వోసీ అనే సినిమాలో మేజర్ పాత్ర పోషించాడు నాగార్జున.ప్రస్తుతం అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న సినిమా బ్రహ్మాస్త్రలో కూడా నటిస్తున్నాడు.

ఈ సినిమాకు కరణ్ జోహార్ నిర్మాతగా ఉన్నాడు.ఇందులో అమితాబ్, రణ్ బీర్, అలియా కీరోల్స్ చేస్తున్నారు.

భూమ్మీద ఇంతటి తెలివైన వ్యక్తి పుట్టడేమో.. ఐఏఎస్ జాబ్ సింపుల్‌గా వదిలేశారు..!!