టాలీవుడ్ లో ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల టికెట్లు అమ్ముడైన ఏకైక చిత్రం

తెలుగు ఇండస్ట్రీలో వెలుగు వెలిగిన నటుడు మెగాస్టార్ చిరంజీవి.ఈయన చేరిన పలు సినిమాలు ఇండస్ట్రీ హిట్ సాధించాయి.

పలు చిత్రాలు రికార్డుల మోత మోగించాయి.అలాంటి సినిమాల్లో ఒకటి 'ఇంద్ర'.

గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు సినిమాల తర్వాత చాలా రోజులు హిట్ కు దూరంగా వున్నాడు చిరంజీవి.

మంచి మాస్ సినిమాలు చేసి కూడా చాలా కాలం అయ్యింది.సరిగ్గా ఇదే సమయంలో దర్శకుడు బి.

గోపాల్ చిరుకు 'ఇంద్ర' రూపంలో బంఫర్ హిట్ అందించాడు.చిరంజీవికి మళ్లీ గత వైభవాన్ని తెచ్చి పెట్టాడు.

2002 జూలై 24న ఇంద్ర మూవీ విడుదల అయ్యింది.ఈ సినిమా రాక తో థియేటర్లు జనాలతో కిక్కిరిసిపోయాయి.

దాయి దాయి దామ్మా అనే పాటకు చిరు వేసిన స్టెప్పులు ప్రేక్షకులకు సూపర్ కిక్ ఇచ్చాయి.

ఈ మూవీ 122 సెంటర్లలో 100 డేస్ ఆడింది.35 సెంటర్లలో 175 రోజులు నడిచింది.

ఈ మూవీ ఎన్నో సరికొత్త రికార్డులు సృష్టించింది.ఫ్యాక్షన్ సినిమాల్లో ఈ సినిమా మైలు రాయిగా నిలిచింది.

ఇంద్ర సినిమా.వైజయంతి మూవీస్ బ్యానర్ పై 15 కోట్లతో రూపొందింది.

ఆరోజుల్లోనే ఈ మూవీ 33 కోట్ల రూపాయలు వసూలు చేసింది.ప్రపంచ వ్యాప్తంగా 2 కోట్ల టికెట్లు అమ్ముడయ్యాయి.

ఇప్పటి లెక్కల ప్రకారం వాటి విలువ 350 కోట్లు ఉంటుందని ట్రేడ్ వర్గాల అంచనా.

"""/"/ వంద రోజులు ఆడిన సెంటర్ల పరంగాను సరి కొత్త రికార్డు క్రియేట్ చేసింది.

అంతే కాదు ఈ సినిమాలో దాయి దాయి దామ్మ సాంగ్ లో చిరంజీవి వేసిన వీణ స్టెప్పు కోసం మల్లి మల్లి సినిమాకు వెళ్లిన జనాల గురించి చెప్పనక్కర్లేదు.

ఇప్పటికి ఆ స్టెప్ టీవీ లో వస్తే చాల మంది అది చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు.

ఇక వైజయంతి బ్యానర్ సాధించిన విజయాలలో ఇది సృష్టించిన రికార్డ్స్ మరల ఏ చిత్రం సాఆడించలేదు.

ఒక ఓ ఫ్యాక్ష‌న్ క‌థ ఇంత విజ‌యాన్ని అందుకోవడం నిజంగా ఒక చరిత్ర.

ఎంబీబీఎస్ ప్రవేశాలు.. ఎన్ఆర్ఐ కోటా నిబంధనల్ని సవరించిన పంజాబ్ సర్కార్