కుటుంబ కథల్ని కూడా ఎంత రొమాంటిక్ గా తీయచ్చో చెప్పిన దర్శకుడు

ఇప్పుడు వస్తున్న సినిమాలకు కొన్నేళ్ల క్రితం తీసిన సినిమాలకు చాల తేడా ఉంటుంది.

సినిమా చూసే విధానం కూడా చాల డిఫరెంట్ గా ఉంటుంది.ఇప్పుడు ఎలివేషన్స్ సినిమాలు, కమర్షియల్ సినిమాలు, రొమాంటిక్ సినిమాలు, క్రైమ్ సినిమాలు అంటూ అన్ని జోనర్స్ కి పేర్లు పెట్టి చెప్తున్నారు.

కానీ ఒక రెండు లేదా మూడు దశాబ్దాలకు వెనక్కి వెళితే ఈ వేరుబాట్లు చాలా తక్కువగా ఉండేవి.

సినిమాను సినిమాలా చూడటం చాల మంది మానేశారు.ఇక ఈ మధ్య కాలంలో కుటుంబం తో సినిమా థియేటర్ కి వెళ్లడం చాల తగ్గిపోయింది.

ఫామిలీ అంత చూడాలంటే అందులో కొన్ని సీన్స్ లేదా మితి మీరిన శృంగారం ఉండకూడదు అని సగటు ప్రేక్షకుడు అనుకుంటాడు.

కానీ ఒకప్పుడు అలా కాదు.అద్భుతమైన కుటుంబ చిత్రాల్లో కూడా లోలోతుల చూడచక్కని రొమాన్స్ నడిపించేవాడు.

అవి చూస్తున్న ప్రేక్షకుడికి ఎక్కడ వెగటు పుట్టకుండా చూడ చక్కదనం తో ఉండేవి.

అందుకే సినిమా ప్రతి ఏడు ఎన్నో మార్పులకు గురవుతుంది.ఉదాహరణకు దర్శకుడు బాపు గారిని తీసుకుంటే ఆయన సినిమాలు ఒక అద్భుతమైన పెయింటింగ్ లా ఉంటాయి.

అలాగే సినిమా ఆసాంతం అందులోకి ప్రేక్షకుడిని తీసుకెళ్లడం ఆయన స్పెషల్.అయన తీసిన సినిమాల్లో కుటుంబం ఉన్నట్టే మంచి రొమాన్స్ కూడా ఉంటుంది.

"""/"/ మిస్టర్ పెళ్ళాం, రాధా గోపాలం, రాంబంటు, పెళ్లి పుస్తకం లాంటి సినిమాలు చూసినప్పుడు ఇప్పుడు వస్తున్న సినిమాల పైన జాలి కలుగుతుంది.

బాపు గారొక దర్శక భాండాగారం అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.

అలాగే తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలకు కేవలం తన బొమ్మల ద్వారా మరియు అయన తీసిన సినిమాల ద్వారా తెలియజేసిన అచ్చతెలుగు బంగారం.

ఇప్పటి తరం దర్శకులు ఆయన్ను చూసి ఎంతో నేర్చుకోవాలి.అయన మొదట తీసిన సాక్షి సినిమా నుంచి చివరగా తీసిన శ్రీరామ రాజ్యం వరకు ప్రతి చిత్రానికి ఒక ప్రత్యేకత ఉంటుంది.

బాపు లాంటి దర్శకుడు కన్ను మూసినా అయన చిత్రాలు, బొమ్మలు ఎప్పటి అందరి మనసుల్లో పదిలంగా, శాశ్వతంగా ఉండి పోతాయి.

5 లక్షల నుంచి నాలుగు రోజుల్లో 500 కోట్ల కలెక్షన్ల స్థాయికి ఎదిగిన ప్రభాస్.. ఏం జరిగిందంటే?