ఆ సినిమాలను ఈ డైరెక్టర్లు తీశారా.. అసలు నమ్మబుద్ధి కావడం లేదే?
TeluguStop.com
సాధారణంగా టాలీవుడ్ డైరెక్టర్లు తమదైన స్టైల్‌లో సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోతారు.ఫలానా సినిమా చూడగానే ఇది ఫలానా డైరెక్టర్ తీశాడు అని మనకి ఈజీగా తెలిసిపోతుంది.
కానీ కొన్ని సినిమాలకు డైరెక్టర్లు ఎవరో తెలుసుకోలేము.ఒకవేళ తెలుసుకున్నా వాటిని ఆ డైరెక్టర్లే రూపొందించారా అని ఆశ్చర్యపోతుంటాం.
అలాంటి కొన్ని సినిమాలు, వాటిని తెరకెక్కించిన దర్శకుల గురించి తెలుసుకుందాం.h3 Class=subheader-style• బోయపాటి శ్రీను/h3p( Boyapati Srinu )
ఈ దర్శకుడు గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.
అల్ట్రా యాక్షన్ సినిమాలు తీస్తూ హిట్స్ సాధిస్తుంటాడు.ఆయన అన్ని మూవీల్లో బీభత్సమైన ఫైటింగ్స్ ఉంటాయి.
కానీ బోయపాటి శ్రీను తీసిన ఫస్ట్ మూవీ భద్ర( Badra ) మాత్రం ఆయన తీసిన మిగతా సినిమాలకు చాలా డిఫరెంట్‌గా ఉంటుంది.
ఈ చిత్రంలో రవితేజ, మీరా జాస్మిన్ హీరోహీరోయిన్లుగా నటించారు, ప్రకాష్ రాజ్, ప్రదీప్ రావత్ ( Prakash Raj, Pradeep Rawat )సపోర్టింగ్ రోల్స్‌లో మెప్పించారు.
ఇందులో ఓన్లీ యాక్షన్ మాత్రమే కాకుండా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి.రవితేజ బాగా కామెడీ చేస్తాడు.
ఫ్యామిలీ డ్రామా కూడా ఉంటుంది.హీరో హీరోయిన్ల మధ్య చాలా ఎమోషనల్ లవ్ స్టోరీ కొనసాగుతుంది.
అప్పట్లో ఈ సినిమా "ఒక్కడు" కాపీ అని కూడా అన్నారు.ఇలాంటి మూవీని బోయపాటి శ్రీను డైరెక్ట్ చేశాడంటే అసలు నమ్మబుద్ధి కాదు.
"""/" /
H3 Class=subheader-style• సుధా కొంగర/h3p( Sudha Kongara )
ఆకాశం నీ హద్దు రా, గురు ( Akasama Ne Haddura, Guru )లాంటి ఎంతో ఇన్‌స్పిరేషనల్ బయోపిక్స్ తీసిన సుధా కొంగర కెరీర్ తొలినాళ్లలో ఒక బి-గ్రేడ్ మూవీ రూపొందించి షాకిచ్చింది.
చాలా ప్రతిభగల, మంచి సినిమాలు రూపొందించగల సత్తా ఉన్నా కూడా సుధా కొంగర అలాంటి సినిమా ఎందుకు తీసిందో ఎవరికీ తెలియదు.
ఇంతకీ ఆ సినిమా పేరు ఏంటంటే "ఆంధ్ర అందగాడు".2008లో వచ్చిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌లో కృష్ణ భగవాన్ హీరోగా అభినయశ్రీ, చిత్రం శ్రీను, శ్రీనివాసరెడ్డి సపోర్టింగ్ యాక్టర్స్ గా నటించి మెప్పించారు.
అయితే ఈ మూవీ ఫ్లాప్ కావడంతో ఆమెకు మరిన్ని అవకాశాలు రాలేదు.ఈ టాలెంటెడ్ డైరెక్టర్ ఆ సినిమా తీసిందని చెప్తే ఎవరూ నమ్మరు.
"""/" /
H3 Class=subheader-style• హను రాఘవపూడి/h3p( Hanu Raghavapudi )
హను రాఘవపూడి అందాల రాక్షసి, కృష్ణ గాడి వీర ప్రేమ గాధ, పడి పడి లేచే మనసు, సీతారామం వంటి హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ సినిమాలు చేశాడు.
అయితే యాక్షన్ మూవీ "లై" కూడా ఆయనే డైరెక్ట్ చేశాడు.కానీ ఈ విషయం ఎవరూ నమ్మలేరు.
"""/" /
H3 Class=subheader-style• సాయి రాజేష్/h3p( Sai Rajesh )
ఈ డైరెక్టర్ కొబ్బరిమట్ట, హృదయ కాలేయం వంటి పేరడీ సినిమాలు తీసి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు.
అయితే కామెడీ సినిమాలు మాత్రమే కాదు బేబీ, కలర్ ఫొటో లాంటి సీరియస్ సినిమాలు కూడా తీశాడు.
కానీ ఈ దర్శకుడు ఇంతటి ఎమోషనల్ సినిమాలు తీశాడు అంటే ఎవరూ నమ్మలేరు.
రాజమౌళి మహేష్ బాబు సినిమా పాన్ వరల్డ్ లో వర్కౌట్ అవుతుందా..?