వ్యవసాయ మార్కెట్లో అధికారుల ఆకస్మిక తనిఖీలు

వ్యవసాయ మార్కెట్లో అధికారుల ఆకస్మిక తనిఖీలు

సూర్యాపేట జిల్లా:ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి,హుజూర్ నగర్ ఆర్డిఓ శ్రీనివాసులు అన్నారు.

వ్యవసాయ మార్కెట్లో అధికారుల ఆకస్మిక తనిఖీలు

శనివారం సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో ధాన్యం కొనుగోలు కేంద్రంలోని వడ్ల రాశులను పరిశీలించారు.

వ్యవసాయ మార్కెట్లో అధికారుల ఆకస్మిక తనిఖీలు

అనంతరం వారు మాట్లాడుతూ.రైతులు ఆరబెట్టిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలన్నారు.

రైతులను ఇబ్బందులకు గురి చేయకుండా, ధాన్యాన్ని వెంటనే కాంటా పెట్టాలన్నారు.కాంటాలో ఎటువంటి తేడాలు వచ్చిన కఠిన చర్యలు తప్పవన్నారు.

కొనుగోలు కేంద్రంలో అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు.ప్రభుత్వం అందించనున్న ధాన్యం మద్దతు ధర మరియు బోనస్ వివరాలను రైతులకు తెలియజేయాలని అధికారులకు సూచించారు.

రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను వినియోగించుకొని మద్దతు ధర పొందాలన్నారు.అనంతరం చిల్లేపల్లి చెక్పోస్ట్ వద్ద రైతులు దాన్యం అమ్ముకునేందుకు ఏర్పాటు చేసిన టోకెన్ విధానాన్ని పరిశీలించి, రైతులకు టోకెన్లు అందించారు.

ఈ కార్యక్రమంలో తాహసిల్దార్ సైదులు,ఏవో జావేద్,సహకార సంఘం ఆడిటర్ నారాయణ శర్మ, ప్రజా ప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

బాహుబలి సమయానికి నా వయస్సు అంతే.. బాహుబలి నటి షాకింగ్ కామెంట్స్ వైరల్!

బాహుబలి సమయానికి నా వయస్సు అంతే.. బాహుబలి నటి షాకింగ్ కామెంట్స్ వైరల్!