వేములవాడ పట్టణ సెల్ పాయింట్ యూనియన్ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక!

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ సెల్ పాయింట్ యూనియన్ నూతన కార్యవర్గాన్ని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

అధ్యక్షుడిగా చౌటపల్లి వెంకటేష్, ఉపాధ్యక్షుడిగా కోడం గంగాధర్, కోశాధికారిగా డెబ్బేటి సంతోష్, ప్రధాన కార్యదర్శిగా గాజుల శ్రీకాంత్, సంయుక్త కార్యదర్శిగా లింగంపల్లి కిరణ్,సయ్యద్ షఫీ, ప్రచార కార్యదర్శిగా చేపూరి ప్రశాంత్, ఏడిగా తిరుపతి, ఏరియా డైరెక్టర్లుగా బత్తిని సంతోష్, మిట్టపల్లి సాయి, పల్తేపు శివ సాయి,పబ్బ ప్రవీణ్, ప్రధాన సలహాదారుడిగా కోనమ్మ గారి రాము, ముఖ్య సలహాదారులుగా మిరియాల ప్రసాద్, గీస మల్లేశం, మోటూరి ప్రవీణ్, సలహాదారులుగా నాగుల వెంకటేష్, శీలం రమేష్, ఎల్లా మల్లేశం లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు ఎన్నికల అధికారి రామిడి శ్రీనివాస్, ఎల్ల మల్లేశం తెలిపారు.

ఈ సందర్భంగా అధ్యక్షుడు వెంకటేష్ మాట్లాడుతూ సంఘ బలోపేతానికి ఎంతో కృషి చేస్తానని, సంఘ సభ్యులకు ఎలాంటి సమస్యలు వచ్చినా ముందుండి పరిష్కార దిశగా తీసుకెళ్తానని తెలిపారు.

అఫీషియల్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న దేవర… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?