తానా ఎన్నికల్లో ఏకగ్రీవాల జోరు…

అమెరికాలో అతిపెద్ద తెలుగు సంస్థగా, ప్రపంచంలోనే ప్రవాస తెలుగు సంస్థలలో అతి పెద్ద సంస్థగా అవతరించిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 2021 ఎన్నికల్లో హాట్ టాపిక్ గా నిలిచింది.

తానా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికలు జరగడంతో తెలుగు ఎన్నారైలు అందరికి ఈ ఎన్నికలు ఎంతో ఆసక్తికరంగా మారాయి.

తానా అధ్యక్ష పదవికి మునుపెన్నడూ లేనివిధంగా ముగ్గురు ఎన్నారైలు పోటీ పడటంతో అందరిలో టెన్షన్ వాతావరణం నెలకొంది.

తానాలో ఎన్నికలు జరిగిన సందర్భాలు లేవు.అధ్యక్ష్య, ఉపాధ్యక్ష, పలు విభాగాలలో వ్యక్తులను తానాలో మాజీ అధ్యక్షులు పెద్దలు కలిసి ఎన్నుకునే వారు, కానీ ఇప్పుడు ఈ పంధాను మార్చారు నేటి తరం యువత.

ఎన్నికలు జరగాలని పట్టుబడటంతో అధ్యక్ష్య, ఉపాధ్యక్ష, పలు విభాగాలో గట్టిపోటీ నెలకొంది.

ఇదిలాఉంటే తాజాగా ఈ ఎన్నికలలు సంభందించి పలు విభాగాలలో నామినేషన్ ప్రక్రియలు జరుగగా కొన్ని మాత్రం ఏకగ్రీవం అయ్యాయి.

నలుగురు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నిక అయినట్టు తానా ఎలక్షన్ కమిటీ ప్రకటించింది.తానా కార్యదర్శిగా నిరంజన్ సతీష్, అంతర్జాతీయ సమన్వయ కర్తగా వడ్లమూడి హితేష్, అలాగే ప్రత్యెక ప్రాజక్టుల సమన్వయ కర్తగా, కొణిదెల లోకేష్ నాయుడు, తానా బోర్డ్ సభ్యురాలిగా లక్ష్మిదేవినేని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

అయితే ఈ ఎన్నికల్లో నిరంజన్ ప్యానల్, నరేన్ ప్యానల్ అంటూ తానా రెండు వర్గాలుగా చీలిపోవడంతో ఇరు వర్గాలు పోటా పోటీగా అభ్యర్ధుల గెలుపుల కోసం తీవ్రంగా కసరత్తులు చేస్తున్నాయి.

తానా ఎన్నికల పరిస్థితి చూస్తుంటే, ఏపీలో జరిగిన పంచాయితీ ఎన్నికలు గుర్తుకు వస్తున్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు పలువురు ఎన్నారైలు.

ఏది ఏమైనా ఈ సారి తానా ఎన్నికలలో భాగంగా వర్గ పోరు ఉండటంతో భవిష్యత్తులో ఈ ప్రభావం తానా సంస్థపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తానా మాజీలు.

అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో నిందితులకు బెయిల్