చైనాకు తిరిగి వెళ్లలేక.. భారత వైద్య విద్య విద్యార్ధుల అవస్థలు, హాస్టల్స్‌లోని వస్తువులపై బెంగ

2019 ఆఖరిలో చైనాలో వెలుగు చూసిన కరోనా మహమ్మారి కరాళ నృత్యం ఇంకా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

వ్యాక్సిన్లకు సైతం లొంగకుండా కొత్త కొత్త వేరియంట్లతో విరుచుకుపడుతూ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.

నలుగురితో కలవలేక, కనీసం స్వేచ్ఛగా తుమ్ముకునే వెసులుబాటు లేక మనిషి కుమిలిపోతున్నాడు.అయితే వైరస్ వెలుగులోకి వచ్చిన కొత్తల్లో వివిధ దేశాల్లో వున్న భారత విద్యార్ధులు, ప్రజలు వెంటనే స్వదేశానికి చేరుకున్నారు.

కొందరిని భారత ప్రభుత్వం ‘‘ వందే భారత్ ’’ మిషన్ ద్వారా వెనక్కి తీసుకొచ్చాయి.

ఇక అసలు మ్యాటర్‌లోకి వెళితే.విదేశాల్లో మెడికల్ కోర్సు చదవాలని ప్రతిఒక్కరూ కోరుకుంటారు.

విదేశాల్లో డాక్టర్ విద్యను పూర్తి చేసి స్వదేశంలో ప్రాక్టీస్ ప్రారంభించాలని భావిస్తుంటారు.అందుకే చాలామంది భారతీయ విద్యార్థులు స్వదేశంలో కంటే విదేశాల్లోనే వైద్య విద్య కోసం పరుగులు పెడుతుంటారు.

ఈ కోవలో చైనాలో పెద్ద సంఖ్యలో మనదేశ విద్యార్ధులు ఎంబీబీఎస్ అభ్యసిస్తున్నారు.భారత్‌లో ఎంబీబీఎస్ సీటు పొందడం కష్టంతో కూడుకున్న పని, ఖర్చు కూడా ఎక్కువే.

దీంతో మెడిసిన్ చదవాలని భావించే వారు తక్కువ ఖర్చు అవుతుందనే ఉద్దేశంతో చైనా లాంటి దేశాల వైపు చూస్తున్నారు.

ఏడాదికి ఏడు వేల డాలర్లు ఖర్చు పెడితే చాలు అత్యాధునిక వసతులు, ల్యాబోరేటరీలు, అద్భుతమైన ఫ్యాకల్టీ సాయాంతో చైనాలో వైద్య విద్యను పూర్తి చేయొచ్చు.

చైనాలో 45 కాలేజీలు ఇంగ్లిష్ మీడియంలో మెడిసిన్ కోర్సును ఆఫర్ చేస్తున్నాయి.మరో 200 కాలేజీల్లో ఇంగ్లిష్‌తోపాటు చైనీస్ భాషల్లో వైద్య విద్యను బోధిస్తున్నారు.

2015లో 13,500 మంది భారతీయ విద్యార్థులు చైనాలో చదువుకున్నారు.చైనా వర్సిటీలకు విద్యార్థులను పంపుతున్న టాప్-10 దేశాల్లో ఒకటిగా భారత్ నిలిచింది.

2019 డేటా ప్రకారం చైనాలో 23 వేల మంది భారతీయ విద్యార్థులు ఉండగా.

వీరిలో 21 వేల మంది చైనీస్ మెడికల్ స్కూళ్లలో చదువుతున్నారు. """/"/ ఇక కోవిడ్ వెలుగులోకి వచ్చిన వుహాన్‌లోనూ ఇంగ్లిష్‌లో ఎంబీబీఎస్ కోర్సును ప్రారంభించారు.

దీంతో అక్కడ మెడిసిన్ చదివేందుకు భారత విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు.వుహాన్ యూనివర్సిటీలో 2500 మంది స్టాఫ్ ఉండగా.

5100 మంది విద్యార్థులు ఉన్నారు.వీరిలో 600 మంది విదేశీ విద్యార్థులున్నారు.

వుహాన్, పరిసర ప్రాంతాల్లో 700 మంది భారతీయ విద్యార్థులు చదువుకుంటుండగా.వీరిలో ఎక్కువ మంది వైద్య విద్యార్థులే.

అయితే కరోనా వైరస్ కారణంగా వుహాన్ సహా చైనాలోని కళాశాలల్లో చదువుకుంటున్న భారతీయ విద్యార్ధులు ఉన్నపళంగా స్వదేశానికి బయల్దేరారు.

అయితే కోవిడ్, ప్రయాణ ఆంక్షల కారణంగా వీరు గడిచిన 20 నెలలుగా చైనాకు తిరిగి వెళ్లలేదు.

ఇదే సమయంలో క్యాంపస్‌లకు తిరిగి రాని వారికి సంబంధించిన సామాగ్రిని హాస్టల్స్‌లో నుంచి తొలగించాలన్న యూనివర్సిటీల ఆదేశాల నేపథ్యంలో వీరంతా తమ విలువైన వస్తువులపై ఆందోళన చెందుతున్నారు.

హాస్టల్ గదుల వెలుపల భారతీయ విద్యార్ధులకు చెందినదిగా చెబుతున్న సామాన్లు గుట్టలు గుట్టలుగా వున్న వీడియోలు ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో చకర్లు కొడుతున్నాయి.

"""/"/ 2020 ప్రారంభంలో కోవిడ్ తీవ్రత దృష్ట్యా యూనివర్సిటీలు, ఇతర విద్యాసంస్థలకు చైనా ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.

దీంతో పాటు లాక్‌డౌన్ విధించడంతో .పరిస్ధితులు చక్కబడిన తర్వాత తిరిగి చైనాకు రావొచ్చనే ఉద్దేశంతో వేలాది మంది భారత విద్యార్ధులు తమ వస్తువులు, సామాగ్రిని హాస్టల్స్‌లోనే వుంచి భారత్‌కు వచ్చేశారు.

అయితే అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలను చైనా ప్రభుత్వం నేటీవరకు తొలగించకపోవడంతో భారత విద్యార్థుల ప్రయాణం వీలుపడటం లేదు.

కేవలం దక్షిణ కొరియా, అమెరికాలకు చెందిన వారికి మాత్రమే చైనా రావడానికి అక్కడి ప్రభుత్వం ప్రస్తుతం అనుమతి ఇస్తోంది.

ఈ నేపథ్యంలో చైనా వెళ్లేందుకు వున్న ఇబ్బందుల విషయంలో కలగజేసుకోవాలని విద్యార్ధులు.ప్రధాని మోడీకి బహిరంగ లేఖ రాశారు.

అయితే కేంద్రం నుంచి ఇంకా ఎలాంటి స్పందనా లభించలేదు.మరోవైపు ఆన్‌లైన్ క్లాసులకు హాజరవుతున్న విద్యార్ధుల పరిస్ధితి మరొలా వుంది.

వుహాన్‌లోని జియాన్ఘన్ వర్సిటీలో ఎంబీబీఎస్ నాల్గవ తరగతి చదువుతున్న నేహా అనే విద్యార్ధి మాట్లాడుతూ.

వైద్య విద్యార్ధులు ప్రాక్టీకల్ అనుభవాన్ని పొందాల్సిన అవసరం వుందని చెప్పారు.కానీ గడిచిన రెండేళ్లుగా తాము దానిని మిస్సవుతున్నట్లు తెలిపారు.

దిండు కింద దాక్కున్న పెద్ద కోబ్రా.. వీడియో చూస్తే అదిరిపడతారు..!