వారిని ఒప్పించలేక అమిత్ షా కూడా చేతులెత్తేశారా ? 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సొంత పార్టీ లో తమ ఆలోచనలను అమలు చేయాలని చూసిన కేంద్ర బిజెపి పెద్దలకు నిరాశే ఎదురైంది.

ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా పార్టీ సీనియర్లంతా పోటీ చేయాలని కేంద్ర హోం మంత్రి బిజెపి అగ్ర నేత అమిత్ షా( Amith Sha ) సూచించారు.

  అంతేకాదు ఈ మేరకు తెలంగాణ బీజేపీ సీనియర్ల పైన ఒత్తిడి చేశారు.

అయితే ఎంత ఒత్తిడి చేసినా కేంద్ర హోం మంత్రి,  తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి( Kishan Reddy ) తో పాటు, మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి వంటి వారు పోటీకి దూరంగానే ఉన్నారు .

ఈ ఎన్నికల్లో సీనియర్ నాయకులకు ఎంత ఒత్తిడి వచ్చినా తాము పోటీ చేసేది లేదని తేల్చి చెప్పేశారు.

దీంతో ఆ స్థానాల్లో ఇతర నేతలకు అవకాశం ఇచ్చారు.గద్వాల నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాల్సిందిగా బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ( DK Aruna )కు సూచించినా ఆమె మాత్రం ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేయనని,  అక్కడ బీసీ సామాజిక వర్గం అభ్యర్థిని పోటీకి దించితే తాను పూర్తిగా మద్దతు ఇస్తానని తేల్చి చెప్పేశారు.

"""/" /  మరో సీనియర్ నేత జితేందర్ రెడ్డిని ( Jithender Reddy )అసెంబ్లీకి పోటీ చేయాలని సూచించినా, ఆయన తన కుమారుడిని పోటీకి దించుతున్నారు.

ఇక లక్ష్మణ్ సైతం తాను రాజ్యసభ సభ్యుడినని అసెంబ్లీకి పోటీ చేయని తేల్చి చెప్పేసారు.

ఇక మల్కాజ్ గిరి నుంచి రామచంద్రరావు ఇదే విషయం వెల్లడించారు.ఎన్ వి ఎస్ ప్రభాకర్ సైతం పోటీకి దూరంగానే ఉన్నారు .

టిడిపి మద్దతుతో ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు .తెలంగాణ ఎన్నికల్లో తాను పోటీ చేయకపోతే పార్టీ క్యాడర్ లో అనేక అనుమానాలు తలెత్తుతాయి అని తెలిసినా కిషన్ రెడ్డి సైతం పోటీకి దూరంగానే ఉన్నారు.

"""/" / ఈ విధంగా తెలంగాణ బిజెపి( Telangana BJP ) సీనియర్లు చాలామంది పోటీకి దూరంగా ఉండటంతో,  వారిపై ఎన్ని రకాలుగా ఒత్తిడి చేసినా పోటీ చేసేది లేదని రకరకాల కారణాలను తెర పైకి తేవడం తో ఈ విషయంలో బిజెపి హై కమాండ్ కూడా చేతులెత్తేసిన పరిస్థితి నెలకొంది.

.

హిందువులు – సిక్కులను విభజించే యత్నం.. కెనడాలో పరిస్ధితులపై భారత సంతతి ఎంపీ ఆవేదన