ఆ బాధ భరించలేక ..  అమెరికాలోనే ఉండిపోయిన కేటీఆర్ !?

బీఆర్ఎస్ ( BRS Party )వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ ( KTR )ఇంకా అమెరికా పర్యటనలోనే ఇంకా ఉన్నారు.

ఆయన అమెరికాకు వెళ్లి చాలా రోజులైనా తెలంగాణలో అడుగు పెట్టేందుకు మరికొన్ని రోజులు సమయం పట్టనుంది.

కేటీఆర్ పర్యటన షెడ్యూల్ ప్రకారం ముగిసినా,  మరికొద్ది రోజులు పాటు దానిని పొడగించుకున్నారు .

బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా ప్రకటనకు ముందే ఆయన అమెరికాకు వెళ్లారు .ఆయన కుమారుడుని ఓ కాలేజీలో చేర్పించేందుకు కేటీఆర్ వెళ్లారు.

దీంతో పాటు అధికారిక పర్యటన కూడా పెట్టుకున్నారు.తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు వివిధ కంపెనీలను ఒప్పించేందుకు అధికారులను కూడా వెంట తీసుకువెళ్లారు.

"""/" / ముందుగా అనుకున్న ప్రకారం కేసీఆర్ షెడ్యూల్ ముగిసి శుక్రవారం హైదరాబాద్ కు ఆయన రావాల్సి ఉంది.

కానీ కేటీఆర్ మాత్రం రాలేదు.ఆయన వెంట వెళ్లిన అధికారులు తిరిగి వచ్చేసినట్లు సమాచారం.

ఈరోజు కేటీఆర్ అమెరికా నుంచి తెలంగాణకు వస్తారని వార్తలు వస్తున్నా , ఆ వార్తలను అటు కేటీఆర్ కార్యాలయం కానీ,  ఇటు తెలంగాణ భవన్ వర్గాలు కానీ క్లారిటీ ఇవ్వడం లేదు.

  దీంతో కేటీఆర్ రాక మరికొద్ది రోజులు పాటు ఆలస్యం కాబోతున్నట్టు అర్థమవుతుంది.

అయితే కేటీఆర్ తన పర్యటన ను పొడిగించుకునేందుకు కారణాలు చాలానే ఉన్నాయి.బీఆర్ఎస్ టిక్కెట్లు దక్కని వాళ్లు చాలామంది కేటీఆర్ కు సన్నిహితంగా మెలిగిన వారే.

"""/" /  గతంలో కేటీఆర్ ( KTR )హామీ ఇచ్చిన వారికి ఈ జాబితాలో చోటు దక్కకపోవడంతో కేటీఆర్ వద్దనే తమ విషయాన్నితేల్చుకోవాలి అని చాలామంది ఎదురుచూస్తున్నారు.

ఇప్పుడు పార్టీలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా అమెరికాలో ఉండడమే మంచిది అని,  ఇప్పట్లో హైదరాబాదులో అడుగుపెడితే అసంతృప్తులు, టికెట్ దక్కినవారంతా తనపై ఒత్తిడి తీసుకొస్తారని కేటీఆర్ భావిస్తున్నారట.

అందుకే ఎవరికీ అందుబాటులో లేకుండా అమెరికాలోనే ఉండిపోయినట్లు సమాచారం

త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమా హీరో ఫిక్స్ అయ్యాడా..?