ఐరాసా భద్రతా మండలిలో మరో ఐదు దేశాలకు సభ్యత్వం
TeluguStop.com
ఐక్యరాజ్య సమితి భద్రాతా మండలిలో( UN Security Council ) మరికొన్ని దేశాలు చేరాయి.
ఇప్పటికే చాలా దేశాలు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో సభ్యత్వం సంపాదించగా.తాజాగా మరికొన్ని దేశాలకు సభ్యత్వం లభించింది.
తాజాగా ఐదు దేశాలకు భద్రతా మండలిలో సభ్యత్వం దక్కింది.ఇందులో అల్జీరియా, గయానా, సియోర్రా లియోన్, స్లోవేనియా, దక్షిణ కొరియా దేశాలకు ఐక్యారాజ్యసమితి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యత్వం లభించింది.
తాత్కాలిక సభ్యత్వం రెండేళ్ల పాటు ఉంటుంది. """/" /
అయితే బెలారస్ ( Belarus ) దేశానికి షాక్ తగిలింది.
ఆ దేశానికి తాత్కాలిక సభ్యత్వం దక్కలేదు.ఆ దేశానికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సభ్యత్వం కల్పించేందుకు సభ్య దేశాలు నిరాకరించాయి.
రష్యా, ఉక్రెయిన్( Russia Ukraine War ) మధ్య యుద్దం కొద్దినెలలుగా జరుగుతూనే ఉంది.
ఇటీవల ఉక్రెయిన్ లోని అతిపెద్ద డ్యామ్‌ను కూడా రష్యా బాంబులతో పేల్చివేసింది.అయితే ఆ రెండు దేశాల మధ్య జరుగుతున్న యుద్దంలో బెలారస్ కూడా పాలుపంచుకుంది.
దీంతో ఆ దేశానికి తాత్కాలిక సభ్యత్వం ఇచ్చేందుకు సభ్య దేశాలు ఆమోదం తెలపలేదు.
"""/" /
కొత్తగా సభ్యత్వం పొందిన దేశాలు జనవరి 1, 2024న బాధ్యతలు చేపట్టనున్నాయి.
తాత్కాలిక సభ్యదేశాల ఎంపిక కోసం ఓటింగ్ నిర్వహిస్తారు.ఈ ఓటింగ్‌లో అప్పటికే సభ్యత్వం పొందిన దేశాలు పాల్గొంటాయి.
తాజాగా ఎంపికైన దేశాలకు సంబంధించి గయానాకు 191 ఓట్లు, సియోర్రా లియన్ కు 188, అల్జీరియాకు 184, దక్షిణ కొరియాకు 180 ఓట్లు వచ్చాయి.
ఐదో సభ్య దేశానికి సంబంధించి బెలారస్, స్లోవేనియా పోటీ పడ్డాయి.స్లోవేనియాకు 153, బెలారస్ కు 38 ఓట్లు పడ్డాయి.
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఘనా, యూఏఈ, బ్రెజిల్, గబాన్, అల్బేనియా సభ్యత్వం ఈ ఏడాదితో ముగియనుంది.
ఇప్పటివరకు భద్రతా మండలిలో 15 దేశాలకు శాశ్వత సభ్యత్వం ఉంది.
అఖండ మూవీ సీక్వెల్ లో బాలయ్యతో పాటు పవన్.. వైరల్ వార్తలో నిజమెంత?