ఐరాస సంచ‌ల‌న నిర్ణ‌యం.. ఇకపై తాలిబ‌న్లు ఆ లిస్టులో ఉండ‌రు..

ప్ర‌పంచాన్ని కుదిపేస్తున్న ఘ‌ట‌న ఇప్ప‌డు ఏదైనా ఉందా అంటే ఒక‌టి క‌రోనా రెండోది ఆఫ్ఘినిస్తాన్ లో తాలిబ‌న్ల అరాచ‌కాలు.

వారు సృష్టిస్తున్న దారుణాల‌ను త‌ల‌చుకోవ‌డానికి కూడా చాలా భ‌యంక‌రంగా ఉంటున్నాయి.తాలిబన్లు ఆ దేశాన్ని త‌మ చేతుల్లోకి తీసుకున్న తర్వాత సంచ‌ల‌న మార్పులు చోటు చేసుకోవ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.

మొన్న‌టి వ‌ర‌కు కాస్త సైలెంట్ గా ఉన్న‌ట్టు క‌నిపించిన తాలిబ‌న్లు ఇప్పుడు దాడుల‌ను పెంచేశారు.

విచ్చిల‌విడిగా వరుసగా జంట పేలుళ్లు సృష్టించి 200 మందిని పొట్ట‌న‌బెట్టుకున్నారు.నిన్న మొన్న‌టి వ‌ర‌కు కాస్త తుపాకీల‌కు ప‌ని చెప్పిన ఈ న‌ర‌హంత‌కులు ఇప్పుడు ఏకంగా ఆత్మాహూతి దాడుల‌కు తెర‌లేపుతున్నారు.

మొన్న జ‌రిగిన జంట పేలుళ్లతోనే ఆఫ్ఘ‌నిస్తాన్‌లో ఉగ్రవాదుల దాడులు ఆగిపోవంటూ ఇప్ప‌డు బైడెన్ కూడా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తున్నారు.

కాబ‌ట్టి ఇలాంటి ప‌రిస్థితుల న‌డుమ ఎలాగైనా ఆప్ఘనిస్తాన్ లో త‌మ అరాచ‌క ప్రభుత్వాన్ని నిర్మించాల‌ని పాటు ప‌డుతున్న తాలిబన్లపై ఇప్పుడు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీసుకున్న నిర్ణ‌యం సంచ‌ల‌నం రేపుతోంది.

అస‌లు వారి మీద ఐరాస వైఖరి మారినట్టుగా తెలుస్తోంది. """/"/ ఇక తాజాగా తాలిబన్లను ఉగ్ర‌వాదుల జాబితా నుంచి తప్పించి భద్రతా మండలి సంచ‌ల‌నం రేపుతోంది.

ఈ భద్రతా మండలి అధ్యక్ష బాధ్యతలను మ‌న ఇండియానే నిర్వ‌హించ‌డం ఇక్క‌డ మ‌రో విష‌యం.

అధ్య‌క్ష హోదాలో ఇప్పుడు ఇండియా కూడా ఆ ఉత్తర్వులపై సంతకం చేసి పెద్ద చ‌ర్చ‌కు దారి తీసింది.

ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల న‌డుమ ఎట్టి ప‌రిస్థితుల్లోనూ అర్ధవంతమైన చర్యల వ‌ల్ల ఇప్పుడు అఫ్ఘనిస్తాన్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడాల‌ని ఐరాస త‌న ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

కాగా ఈ ప్ర‌భుత్వంలో హింస కాకుండా శాంతియుతంగా ప‌నులు జ‌ర‌గాల‌ని ఆకాంక్షించింది.మ‌రి ఐరాస ఇలాంటి నిర్ణ‌యంతో ఎలాంటి విమ‌ర్శ‌లు వ‌స్తాయో చూడాలి.

చనిపోయిన కోళ్ల నుంచి ఎగిసిపడుతున్న మంటలు.. వీడియో చూసి నెటిజన్లు షాక్..