ఉమా కొప్పేశ్వర స్వామి ఆలయం గురించి మీకు ఈ విషయాలు తెలుసా?
TeluguStop.com
మనకు తెలిసినంత వరకు ఏ శివుడి గుడిలో అయినా స్వామి వారి విగ్రహం ఎక్కువగా కనిపించదు.
లింగ రూపంలోనే ఈ పరమ శివుడు దర్శనమిస్తాడు.అంతే కాకుండా శివలింగం ఒక గుడిలో ఉంటే మరో గుడిలో పార్వతీ దేవి కొలువై ఉండడాన్ని చూస్తుంటాం.
కానీ ఆంధ్ర ప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట మండలంలోని పలివెలలో మాత్రం శివలింగం పక్కనే పార్వతీ దేవి వారి పక్కన వినాయక, కుమార స్వామి విగ్రహాలు ఉన్నాయి.
మొదట్లో ఇక్కడ శివుడిని ఉమా అగస్త్యేశ్వరస్వామిగా పిలిచినా ఓ పూజారిని కాపాడేందుకు ఆ శంకరుడు కొప్పు ధరించాడట.
అలా అగస్త్యేశ్వర స్వామి కాస్త కొప్పేశ్వర స్వామిగా మారిపోయాడు.అగస్త్య మహర్షి కైలాసంలో జరిగే శివ పార్వతుల కల్యాణం చూడలేకపోయినందుకు తెగ బాధపడతాడట.
శివుడి అనుగ్రహం కోసం ఘోర తపస్సు చేశాడట.అందుకు మెచ్చిన ఆది దంపతులు ప్రత్యక్షమవ్వగా.
వారి పెళ్లిని చూసే భాగ్యం కల్పించమని అగస్త్యుడు కోరుతాడు.అలా మహర్షి కోరికను మన్నించిన ఆ పరమ శివుడు.
పార్వతి, కుమారులతో సహా ఇక్కడ వెలిశాడని ప్రతీతి.అయితే అప్పటి నుంచి ఈ స్వామి వారిని అగస్త్యేశ్వరుడిగా, పార్వతిని ఉమాదేవిగా పూజించడం మొదలుపెట్టారు.
తర్వాత తర్వాత పరమ శివుడు కాస్త కొప్పేశ్వర స్వామిగా మారిపోయాడు.అంతే కాదండోయ్ ఇక్కడకి ఎక్కువగా వ్యసనాలకు బానిసలైన వారిని తీసుకొచ్చి ప్రదక్షిణలు, ఏకాదశ రుద్రాభిషేకం, ఉమా దేవికి కుంకుమార్చన చేయిస్తే వాటి నుంచి త్వరగా బయడపడతారని భక్తుల నమ్మకం.
ఇక్కడ మహా శివరాత్రి సమయంలో అంగరంగ వైభవంగా పార్వతీ పరమేశ్వరులకు కల్యాణం జరిపిస్తారు.
ఆ తర్వాత రథోత్సవాన్ని నిర్వహిస్తారు.కన్నులపండుగ్గా జరిగే ఈ రథోత్సవాన్ని చూసేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తారు.
పావలా శ్యామలకు అండగా నిలిచిన పూరి కుమారుడు ఆకాష్…మంచి మనస్సు అంటూ?