రౌడీ స్టార్ టీషర్ట్ గురించి ఆసక్తికర చర్చ..ధర ఎంతంటే?

టాలీవుడ్ లో రౌడీ స్టార్ కు ఉన్న క్రేజ్ అంత ఇంత కాదు.

ఈయనకు ప్రత్యేకంగా యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది.పెళ్లి చూపులు అనే చిన్న సినిమాపై తెలుగు తెరపై మ్యాజిక్ చేసి ఆ తర్వాత అర్జున్ రెడ్డి సినిమాతో మాస్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ ఐఐదు.

ఇక అప్పటి నుండి అర్జున్ రెడ్డి స్టార్ డమ్ అమాంతం పెరిగిపోయింది.ఇక విజయ్ దేవరకొండ ఫ్యాషన్ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు.

విజయ్ ఫ్యాషన్ కు యూత్ లో మంచి క్రేజ్ ఉంది.ఇక విజయ్ దేవరకొండ సినిమాల్లో కాకుండా బయట ఎక్కడ కనిపించిన అతడి ఫ్యాషన్ గురించి తప్పకుండ మాట్లాడు కుంటారు.

తాజాగా విజయ్ ఫ్యాషన్ గురించి మరొకసారి చర్చకు వచ్చింది.అందుకు కారణం కూడా ఉంది.

నిన్న రాత్రి జరిగిన రౌడీ బాయ్స్ సినిమా సెకండ్ సాంగ్ రిలీజ్ ఈవెంట్ కు విజయ్ ముఖ్య అతిధిగా విచ్చేసారు.

ఆ ఈవెంట్ కు విజయ్ టీషర్ట్ వేసుకుని వచ్చాడు. """/"/ ఇప్పుడు రౌడీ స్టార్ ఫ్యాన్స్ తో పాటు సోషల్ మీడియా సైతం విజయ్ టీషర్ట్ గురించి చర్చించు కుంటున్నారు.

విజయ్ జీరో టాలరెన్స్ గ్యాంగ్ స్టర్ స్వెట్ టీషర్ట్ వేసుకుని దర్శన మిచ్చాడు.

ఇందులో విజయ్ చాలా స్టైలిష్ గా క్యూట్ గా కనిపించడంతో ఇప్పుడు అందరి కళ్ళు విజయ్ వేసుకున్న టీషర్ట్ మీదనే పడింది.

"""/"/ ఈ టీషర్ట్ రేట్ ఇండియాలో 10,500 రూపాయలుగా ఉంది.ఇక ఈ టీషర్ట్ నచ్చిన ఫ్యాన్స్ అప్పుడే దీనిని కొనడానికి రెడీ అయిపోతున్నారు.

ఎంతైనా రౌడీ స్టార్ అంటే ఆ మాత్రం క్రేజ్ ఉంటుంది కదా.ఇక విజయ్ సినిమాల విషయానికి వస్తే ప్రెసెంట్ విజయ్ దేవరకొండ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 'లైగర్' సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమాతో విజయ్ పాన్ ఇండియాలో అడుగు పెట్ట బోతున్నాడు.

ఎన్నికల ప్రచారంలో దివంగత హీరో కృష్ణపై చింతమనేని ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు..!!