మహారాజా దులీప్ సింగ్ వారసత్వాన్ని నిలబెట్టేలా.. యూకే మ్యూజియానికి 2 లక్షల పౌండ్ల గ్రాంట్

సిక్కు సామ్రాజ్య చివరి పాలకుడు మహారాజా దులీప్ సింగ్( Maharaja Duleep Singh ) వారసత్వానికి గుర్తుగా నేషనల్ లాటరీ హెరిటేజ్ ఫండ్ ద్వారా యూకేలోని( UK ) ఒక మ్యూజియానికి దాదాపు 2 లక్షల పౌండ్ల గ్రాంట్ అందింది.

నార్ఫోక్ థెట్‌ఫోర్డ్‌లొని పురాతన మ్యూజియం 100వ వార్షికోత్సవం సందర్భంగా ఈ నగదును ప్రదానం చేసినట్లు బ్రిటీష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పోరేషన్ (బీబీసీ) నివేదించింది.

ఈ మ్యూజియాన్ని 1924లో మహారాజా దులీప్ సింగ్ కుమారుడు ప్రిన్స్ ఫ్రెడరిక్ దులీప్ సింగ్( Prince Frederick Duleep Singh ) స్థాపించారు.

ప్రదర్శనల ద్వారా ప్రజలకు దులీప్ కుటుంబ కథను చెప్పడానికి ఈ గ్రాంట్ ఉపయోగించనున్నారు.

"""/" / మహారాజా దులీప్ సింగ్ .సిక్కు సామ్రాజ్యాన్ని( Sikh Empire ) దశ దిశలా వ్యప్తి చేసిన ‘‘ షేర్ ఈ పంజాబ్ ’’ మహారాజా రంజిత్ సింగ్ చిన్న కుమారుడు.

తన తండ్రి, సోదరుల మరణం తర్వాత దులీప్ సింగ్ కేవలం ఐదేళ్ల వయసులోనే పట్టాభిషేకం జరుపుకున్నారు.

కానీ ఆంగ్లేయులు 1849లో అతనిని సింహాసనం నుంచి తొలగించారు.దీంతో 15 సంవత్సరాల వయసులో దులీప్ సింగ్.

ఇంగ్లాండ్ చేరుకుని సఫోల్క్‌లోని ఎల్వెడెన్ హాల్‌లో ఇంటిని ఏర్పాటు చేసుకున్నాడు.దులీప్ సింగ్ తర్వాత అతని కుటుంబం దాదాపు శతాబ్ధం పాటు ఈ ప్రాంతంలోనే వుంది.

దులీప్ రెండవ కుమారుడు ప్రిన్స్ ఫ్రెడరిక్ .థెట్‌ఫోర్డ్ ఏన్షియంట్ హౌస్ మ్యూజియాన్ని( Thetford Ancient House Museum ) పట్టణ ప్రజలకు విరాళంగా ఇచ్చారు.

"""/" / ఈ మ్యూజియం ఇప్పుడు.దులీప్ సింగ్ కుటుంబ చరిత్రను ప్రదర్శించడానికి రెండేళ్ల ప్రాజెక్ట్‌ని ప్రారంభిస్తోందని నేషనల్ లాటరీ హెరిటేజ్ ఫండ్ ఫర్ ఇంగ్లాండ్, మిడ్‌ల్యాండ్స్, ఈస్ట్ డైరెక్టర్ రాబిన్ లెవెల్లిన్ అన్నారు.

నార్ఫోక్ కౌంటీ కౌన్సిల్ కొత్త ప్రదర్శనలలో ఆంగ్లో పంజాబ్ చరిత్ర, వారి విలాసవంతమైన ఖజానా, ఎల్వెడెన్ హాల్ నమూనా, దులీప్ సింగ్ చిత్రపటం తదితర ప్రదర్శనలు వుంటాయి.

అలాగే దులీప్ సింగ్ వాడిన వాకింగ్ స్టిక్ వంటి ఇతర కుటుంబ వస్తువులను కూడా మ్యూజియంలో ప్రదర్శనకు వుంచారు.

కింగ్ ఎడ్వర్డ్ VII ప్రిన్స్ ఆఫ్ వేల్స్‌గా వున్నప్పుడు దులీప్ సింగ్‌కి ఈ వాకింగ్ స్టిక్ అందించారు.

గురుపత్వంత్ పన్నూన్‌కు షాక్ .. ఎస్ఎఫ్‌జేపై ఐదేళ్ల నిషేధం , హోంశాఖ నిర్ణయానికి ఆమోదం