రష్యా డ్రోన్ దాడులు ఎదురుకోవడానికి ఉక్రెయిన్ చేతికి సరికొత్త ఆయుధాలు..!!

రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది.

ఈ రెండు దేశాల మధ్య మాత్రమే కాదు మరోపక్క ఉత్తరకొరియా మరియు దక్షిణ కొరియాల మధ్య కూడా యుద్ధమేఘాలు అలముకుంటున్నాయి.

ఇదిలా ఉంటే రష్యా .డ్రోన్ దాడులతో ఉక్రెయిన్ లో ప్రధాన నగరాలపై విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే.

ప్రధానంగా విద్యుత్ కేంద్రాలపై దాడులు చేయటంతో ఉక్రెయిన్ లో సగానికి పైగా నగరాలు అంధకారంలోకి వెళ్లిపోయాయి.

ఇలాంటి తరుణంలో రష్యా డ్రోన్ దాడులను ఎదుర్కోవటానికి ఉక్రెయిన్ కి పశ్చిమ దేశాలు అత్యాధునిక ఆయుధాలు అందించాయి.

రష్యా డ్రోన్ దాడులను తిప్పి కొట్టడానికి "ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ" అత్యాధునిక మిసైల్ సిస్టం టెక్నాలజీ ఉక్రెయిన్ కి అందించడం జరిగింది.

దీంతో పశ్చిమ దేశాలు అందించిన మిసైల్ సిస్టం వల్ల తమ సైన్యాన్ని పటిష్టంగా, గగనతలాని సురక్షితంగా మారుస్తాయని ఉక్రెయిన్ ప్రకటించటం జరిగింది.

చిరంజీవితో అకీరా ఫస్ట్ సినిమా… మెగా ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే న్యూస్!