ఫారిన్ ట్రావెల్స్‌కు బ్రిటన్ సర్కార్ శుభవార్త... ఇక కరోనా టెస్ట్ అక్కర్లేదు

దక్షిణాఫ్రికాలో పుట్టిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వల్ల తీవ్రంగా ఇబ్బంది పడింది బ్రిటన్.

లక్షలాది కేసులు, వందల్లో మరణాలతో ఇంగ్లీష్ గడ్డ వణికిపోయింది.ప్రజలను వైరస్ నుంచి రక్షించేందుకు మరోసారి ఆంక్షలు విధించడంతో పాటు వేగంగా బూస్టర్ డోస్‌ను వేసింది.

కేసులు విపరీతంగా వస్తున్నా భయపడకుండా పోరాటం కొనసాగించింది.ఈ చర్యలు ఫలించి ఇప్పుడిప్పుడే బ్రిటన్ కోలుకుంటోంది.

గడిచిన కొన్ని రోజులుగా యూకేలో కేసులు తగ్గుతూ వస్తున్నాయి.ఈ నేపథ్యంలో యూకేలో ఆంక్షలను ఉపసంహరించి, ప్రజలకు స్వేచ్ఛాయుత వాతావరణం కలిగించాలని ప్రధాని బోరిస్ జాన్సన్ నిర్ణయించారు.

దీనిలో భాగంగా వచ్చే గురువారం నుంచి ఈ ఆంక్షలను ఎత్తివేస్తామని బ్రిటన్ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ప్రకటించారు.

అంతేకాదు వచ్చే వారం నుంచి ప్రజలు మాస్క్‌ ధరించడం తప్పనిసరి కాదని ఆయన వ్యాఖ్యానించారు.

దేశంలో ఒమిక్రాన్‌ అదుపులోకి వచ్చినట్లు నిపుణులతో పాటు పలు అధ్యయనాలు చెబుతున్నందున ఆంక్షల ఎత్తివేత దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ప్రధాని వెల్లడించారు.

చెప్పిన విధంగానే బోరిస్ జాన్సన్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.దీనిలో భాగంగా అంతర్జాతీయ ప్రయాణీకులకు బోరిస్ జాన్సన్ శుభవార్త చెప్పారు.

రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకుని.తమ దేశానికి వచ్చే వారికి కరోనా టెస్టులు చేయకూడదని యూకే సర్కార్ భావిస్తోందట.

టీకా తీసుకున్న అంతర్జాతీయ ప్రయాణికులను కోవిడ్ టెస్టుల నుంచి మినహాయించే ఆలోచనలో ఉన్నట్లు జాన్సన్ వెల్లడించారు.

అలాగే ప్రస్తుతం దేశంలో రోజువారి ఒమిక్రాన్ కేసులు కూడా అదుపులోకి వస్తున్నాయని చెప్పారు.

ఈ క్రమంలోనే అంతర్జాతీయ వాణిజ్యం, పర్యాటకులకు తమ దేశం తలుపులు తెరిచే ఉన్నాయని చెప్పేందుకే కోవిడ్ టెస్టు నుంచి మినహాయింపు ఇవ్వాలని అనుకుంటున్నట్లు బోరిస్ జాన్సన్ వెల్లడించారు.

లోక్‎సభ ఎన్నికల 4వ విడత నోటిఫికేషన్ విడుదల