ఇండియాను సురక్షిత దేశాల లిస్ట్‌లో చేర్చిన యూకే .. ఇకపై అక్రమంగా ప్రవేశిస్తే భారతీయులకు ఆశ్రయం కష్టమే

ఇండియాను సురక్షిత దేశాల లిస్ట్‌లో చేర్చిన యూకే ఇకపై అక్రమంగా ప్రవేశిస్తే భారతీయులకు ఆశ్రయం కష్టమే

యూకే ప్రభుత్వం భారత్‌ను సురక్షిత దేశాల జాబితాలో చేర్చనున్నట్లు ప్రకటించింది.ఈ నిర్ణయం కారణంగా గతంలో భారతదేశం నుంచి అక్రమంగా ప్రయాణించిన వ్యక్తులను తిరిగి అప్పగించే ప్రక్రియను ఇది వేగవంతం చేస్తుందని నిపుణులు తెలిపారు.

ఇండియాను సురక్షిత దేశాల లిస్ట్‌లో చేర్చిన యూకే ఇకపై అక్రమంగా ప్రవేశిస్తే భారతీయులకు ఆశ్రయం కష్టమే

అంతేకాదు.చిన్న పడవలు లేదా ఇతర మార్గాల్లో దేశంలోకి అక్రమంగా ప్రవేశించే భారతీయ పౌరులు( Indian Nationals ) యూకేలో ఆశ్రయం కోరుతూ దాఖలు చేసే పిటిషన్లు అనుమతించబడవు.

ఇండియాను సురక్షిత దేశాల లిస్ట్‌లో చేర్చిన యూకే ఇకపై అక్రమంగా ప్రవేశిస్తే భారతీయులకు ఆశ్రయం కష్టమే

యూకే హోం ఆఫీసు చేసిన ఒక ప్రకటన ప్రకారం.భారత్, జార్జియాలను 'safe States’ జాబితాలో చేర్చారు.

అంతేకాదు.ఈ నిర్ణయం ‘‘అక్రమ వలస చట్టం, 2023’’( Illegal Migration Act 2023 ) కింద పడవలను నిలిపివేయడం, ఇతర ప్రణాళికల దశను సూచిస్తుందని హోంశాఖ పేర్కొంది.

బుధవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన ముసాయిదా చట్టం .ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను బలోపేతం చేస్తుందని హోంశాఖ చెప్పింది.

నిరాధారమైన రక్షణ క్లెయిమ్‌లు చేసే వ్యక్తులతో సహా దుర్వినియోగాన్ని నిరోధించడంలో సహాయపడుతుందని పేర్కొంది.

భారత్, జార్జియాల నుంచి చిన్న పడవల రాకపోకలు పెరుగుతున్నాయని ఈ దేశాలను యూకే( UK ) సురక్షితంగా భావిస్తోందని హోంశాఖ స్పష్టం చేసింది.

అందువల్ల ఈ దేశాలకు చెందిన వారు ఆశ్రయం కోసం చేసే దావాలను అంగీకరించేది లేదని పేర్కొంది.

ఇకపోతే.యూకే సురక్షితమని భావించే ఇతర దేశాలలో అల్బేనియా, స్విట్జర్లాండ్, యూరోపియన్ యూనియన్, యూరోపియన్ ఎకనామిక్ ఏరియా దేశాలు వున్నట్లు హోం ఆఫీస్ తెలిపింది.

"""/" / సురక్షితమైన దేశాల నుంచి యూకేకి ప్రమాదకరమైన, చట్టవిరుద్ధమైన ప్రయాణాలు చేయకుండా ప్రజలను తప్పనిసరిగా ఆపాలని ఆ దేశ హోం సెక్రటరీ సుయెల్లా బ్రేవర్‌మాన్( UK Home Secretary Suella Braverman ) స్పష్టం చేశారు.

కాగా.చిన్న బోటులలో( Boats ) ప్రాణాలను పణంగా పెట్టి ఇంగ్లీష్ ఛానెల్‌ను( English Channel ) దాటి బ్రిటన్‌లోకి వస్తున్న భారతీయుల సంఖ్య ఆందోళనకరంగా వుందని గణాంకాలు చెబుతున్నాయి.

2022లో మొత్తం 683 మంది భారతీయులు చిన్న పడవల ద్వారా ఫ్రాన్స్ నుంచి ఇంగ్లీష్ ఛానెల్‌ను అక్రమంగా దాటారు.

"""/" / వీరిలో ఎక్కువమంది 40 ఏళ్ల లోపు పురుషులే.దురదృష్టవశాత్తూ ఈ మార్గాన్ని ఉపయోగించే భారతీయుల సంఖ్య క్రమంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది.

2018, 19లలో భారతీయులెవరూ చిన్న పడవల్లో యూకేలోకి ప్రవేశించలేదు.కానీ 2020లో మాత్రం 64 మంది భారతీయులు ఈ మార్గాన్ని ఉపయోగించారు.

తర్వాత 2021లో 67 మంది, 2022లో ఈ సంఖ్య ఏకంగా 683కి చేరడంతో యూకే అధికారులు ఉలిక్కిపడ్డారు.

ఇక అన్ని దేశాల ప్రజలు కలిపి 2022లో మొత్తం మీద 45,755 మంది ఇంగ్లీష్ ఛానెల్‌ను దాటారు.

అక్రమ వలసదారుల బహిష్కరణ .. పనామాలో భారతీయుల అవస్థలు