యూకే : పీకలదాకా తాగి పొరుగింట్లోకి , వృద్ధులన్న కనికరం లేకుండా పైశాచికం.. సిక్కు వ్యక్తికి జైలు

ఇంగ్లాండ్‌లోని వెస్ట్ మిడ్‌లాండ్స్( West Midlands ) ప్రాంతంలో తాగిన మైకంలో వృద్ధ దంపతులపై దాడి చేసిన 41 ఏళ్ల సిక్కు వ్యక్తికి యూకే కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది.

అలాగే పదేళ్ల పాటు సదరు వృద్ధ దంపతులను( Elderly Couple ) కలవకుండా అతనిపై బ్యాన్ విధించినట్లు మీడియా తెలిపింది.

నిందితుడిని గుర్జాప్ సింగ్‌గా( Gurjap Singh ) గుర్తించారు.ఇతను తన ఇంటి పక్కన నివసిస్తున్న మహిళను చెంపపై కొట్టి.

ఆమె భర్తను గొంతు కోసి చంపేందుకు యత్నించాడని బర్మింగ్‌హామ్ మెయిల్ వార్తాపత్రిక గురువారం నివేదించింది.

శారీరక హాని, భౌతికదాడి అభియోగాలపై ఇతను నేరాన్ని అంగీకరించాడు.అలాగే 200 గంటలు వేతనం లేకుండా పని నిర్వహించాలని.

బాధితులు ఒక్కొక్కరికి 100 పౌండ్ల పరిహారం, 250 పౌండ్ల అదనపు ఖర్చు చెల్లించాలని న్యాయమూర్తి ఆదేశించారు.

"""/" / స్టోక్ ఆన్ ట్రెంట్ క్రౌన్ కోర్టులో( Stoke-on-Trent Crown Court ) విచారణ సందర్భంగా సింగ్ .

బైపోలార్ డిజార్డర్‌తో బాధపడుతున్నాడని ప్రాసిక్యూటర్లు తెలిపారు.ఫెంటన్‌లోని( Fenton ) గోల్డెన్ హిల్‌లోని తన ఇంటివైపు వెళ్తున్న మహిళపై దాడి చేసిన సమయంలో అతను ఉన్మాద స్థితిలో వున్నాడని పేర్కొన్నారు.

ఈ ఏడాది ఫిబ్రవరి 5న తన కుమారుడి వద్దకు వెళ్లి సాయంత్రం ఇంటికి ఏడుస్తూ తిరిగొచ్చిన బాధితురాలు.

అతను నన్ను కొట్టాడు, చంపేందుకు ప్రయత్నించాడని భర్తతో చెప్పింది.సరిగ్గా అదే సమయంలో ఇంటి వెనుక నుంచి ప్రవేశించిన సింగ్ నేను నిన్ను చంపబోతున్నానని ఆ మహిళతో చెప్పాడు.

"""/" / అలా చెప్పిన వెంటనే ఆమె ముఖంపై పలుమార్లు కొట్టాడు.ఇంతలో బాధితురాలి భర్త అతనిని అడ్డుకునేందుకు ప్రయత్నించాడు.

అప్పటికే ఆగ్రహంతో ఊగిపోతోన్న సింగ్.అతనిని బలంగా వెనక్కి నెట్టడంతో బాధితురాలి భర్తకు గాయమైందని ప్రాసిక్యూటర్( Prosecutor ) కోర్టుకు తెలియజేశారు.

అక్కడితో ఆగకుండా అతని గొంతు పట్టుకున్నాడని.దీంతో ఆయన శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారని ప్రాసిక్యూటర్ చెప్పారు.

దంపతులు, సింగ్ ఇద్దరూ పక్కపక్క ఇళ్లలోనే వుంటున్నారని.అతనిని వారు కన్న కొడుకులా చూసుకున్నారని కోర్టుకు తెలిపారు.

దాడికి ముందు తాను క్వార్టర్ బాటిల్ వోడ్కాను తాగానని, తనకు బైపోలార్ డిజార్డర్‌( Bipolar Disorder ) వుందని నిందితుడు అధికారులకు చెప్పాడు.

ప్రెగ్నెన్సీ సమయంలో ఆడవారు కచ్చితంగా తినాల్సిన పండ్లు ఇవే!