యూకే రాయల్ గార్డ్‌కు వడదెబ్బ.. వీడియో వైరల్..

ఇటీవల యూకేలో ఉష్ణోగ్రతలు( Temperatures In The UK ) 26 డిగ్రీల సెల్సియస్‌ను దాటిన నేపథ్యంలో దేశం వ్యాప్తంగా ఎండ వేడిమి తాళలేక ప్రజలు అల్లాడిపోతున్నారు.

వడగాలుల తీవ్రత కూడా బాగా పెరిగిపోయింది.ఈ ప్రభావానికి ఒక రాయల్ గార్డ్ కూడా తీవ్ర అస్వస్థతకు గురైయ్యాడు.

రీసెంట్ గా విండ్‌సర్ కోటలో జరిగిన "ఆర్డర్ ఆఫ్ ది గార్టర్"( Order Of The Garter ) కార్యక్రమంలో కింగ్ చార్లెస్ III, క్వీన్ కమిల్లా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఒక రాయల్ గార్డ్, ఫుల్ యూనిఫాం ధరించి, ఎండలో నిలబడి ఉండాల్సి వచ్చింది.

అయితే ఈ సమయంలో అతను తీవ్రమైన ఎండ తాకిడికి స్పృహ కోల్పోయాడు.అతను ముందుకు వెనుకకు ఊగుతూ, కింద పడబోయాడు.

అదృష్టవశాత్తు, అతని సహచర గార్డులు వెంటనే స్పందించి, అతను కింద పడకుండా కాపాడారు.

తర్వాత, వైద్య చికిత్స కోసం అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు.ఈ ఒక్క వారంలోనే భానుడి భగభగల కారణంగా ముగ్గురు రాయల్ గార్డ్స్‌ స్పృహ తప్పారు.

"""/" / వీడియో చూసిన వారు ఆవేదనను వ్యక్తం చేశారు.బరువైన యూనిఫారంలో ఎక్కువసేపు నిలబడే ముందు గార్డులు తినడానికి ఏమీ ఇవ్వరా తాగడానికి కూల్ వాటర్ కూడా వారికి ఉండదా అని ప్రశ్నించారు.

ఇలాంటి ఎండల్లో ఏమీ తినకపోతే రక్తపోటు తగ్గుతుందని ఒక వ్యక్తి వ్యాఖ్యానించాడు.గార్డు నిటారుగా ఉండటానికి తీవ్రంగా ప్రయత్నించాడని, దాని ఫలితంగా అతను ఒక బాడీ పై మరింత ప్రభావం పడినట్లు కొందరు పేర్కొన్నారు.

మరొక నెటిజన్ తోటి గార్డుల క్విక్ రియాక్షన్‌ను మెచ్చుకున్నారు, ఇంతకుముందు గార్డ్‌లను నేలపై పడుకోబెట్టి ఇతర గార్డులు చివాట్లు తిన్నారు.

వేసవిలో గార్డులు తేలికైన యూనిఫాం ధరించాలని, వాటర్ బాటిళ్లు అందుబాటులో ఉండాలని కొందరు సూచించారు.

"""/" / ఈ కాలంలోనూ ఇటువంటి డిమాండ్‌తో కూడిన రాయల్ ప్రోటోకాల్‌ల ( Royal Protocols )ఆవశ్యకతను కూడా విమర్శకులు ప్రశ్నించారు, కాపలాదారులు వేడిలో ఎక్కువసేపు నిలబడాలని కోరడం అసమంజసమని, దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా అని తిట్టారు.

ఎంత ఆరోగ్యం ఉన్నా సరే ఈ ఎండవేడికి ఎవరూ తట్టుకోలేరు అని మరొకరు అన్నారు.

మిలటరీ డ్యూటీ చేసే వాళ్ళు సాధారణంగా ఎండ వేడిమిని తట్టుకోవాల్సి ఉంటుంది.ఎక్కువసేపు ఎండలో నిలబడాల్సి ఉంటుంది.

అయితే ప్రకృతిని మనుషులు అన్నివేళలా తట్టుకోలేరు.దీని ఫలితంగా కింద పడిపోవడం, తీవ్రమైన అనారోగ్యానికి గురి కావడం జరుగుతుంది.

పవన్ కళ్యాణ్ కు మీ వల్లే ఈ డామేజ్ జరిగింది… బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు!