కాశ్మీరీ పండిట్ల వలసకు 35 ఏళ్లు .. యూకే పార్లమెంట్‌లో తీర్మానం

కాశ్మీరీ పండిట్ల వలసకు 35 ఏళ్లు యూకే పార్లమెంట్‌లో తీర్మానం

90వ దశకంలో జమ్మూకాశ్మీర్‌లో కశ్మీరీ పండిట్లపై( Kashmiri Pandits ) జరిగిన దారుణాలు అన్నీ ఇన్ని కావు.

కాశ్మీరీ పండిట్ల వలసకు 35 ఏళ్లు యూకే పార్లమెంట్‌లో తీర్మానం

ఉగ్రవాదుల ధాటికి ఎంతో మంది కశ్మీరి పండిట్లు ఇళ్లు, వాకిళ్లను వదులుకుని సుదూర ప్రాంతాలకు వెళ్లి స్థిరపడ్డారు.

కాశ్మీరీ పండిట్ల వలసకు 35 ఏళ్లు యూకే పార్లమెంట్‌లో తీర్మానం

కాశ్మీర్ లోయలోని మైనారిటీ హిందూ జనాభాపై సరిహద్దుల్లోని తీవ్రవాదులు , వారి మద్ధతుదారులు దాడులకు తెగబడేవారు.

తాజాగా 1990లో కాశ్మీర్ లోయ నుంచి కశ్మీరీ పండిట్ల వలసకు 35 ఏళ్లు నిండుతున్న సందర్భంగా యూకే పార్లమెంట్( UK Parliament ) ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది.

జనవరి 19ని కాశ్మీరీ పండిట్ నిర్గమ దినోత్సవంగా( Kashmiri Pandit Exodus Day ) జరుపుకోవాలని యూకే ప్రభుత్వాన్ని ఈ తీర్మానం కోరుతోంది.

అలాగే భారత పార్లమెంట్‌లో ప్రతిపాదించిన ‘Panun Kashmir Genocide Crime Punishment And Atrocities Prevention Bill’ ను అమలు చేయాలని భారత ప్రభుత్వాన్ని కోరుతోంది.

ఉగ్రవాదుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన, అత్యాచారం చేయబడిన, గాయపడిన , నిరాశ్రయులైన వారికి ఈ తీర్మానం ద్వారా సంతాపం తెలియజేసింది.

అలాగే జమ్మూకాశ్మీర్‌లోని పవిత్ర స్థలాలను అపవిత్రం చేయడాన్ని ఖండిస్తోంది. """/" / యూకేలో హిందువుల( UK Hindus ) హక్కులను కాపాడతామని, న్యాయం కోరే హక్కును కూడా కల్పిస్తామని ఈ తీర్మానంలో ప్రస్తావించారు.

హింసాత్మక పరిస్ధితుల నుంచి ప్రాణాలను కాపాడుకునేందుకు పారిపోయిన వారికి 35 ఏళ్లుగా ఎలాంటి న్యాయం జరగలేదని పేర్కొన్నారు.

కన్జర్వేటివ్ పార్టీకి చెందిన యూకే ఎంపీ బాబ్ బ్లాక్‌మన్( UK MP Bob Blackman ) ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా.

దీనికి పలువురు ఎంపీలు మద్ధతు ఇచ్చారు.2015లోనూ కాశ్మీరీ పండిట్ల వలసలకు 25 ఏళ్లు గడుస్తున్న సందర్భంగా ఇలాంటి ఒక తీర్మానాన్ని యూకే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు .

"""/" / కాగా.కాశ్మీరీ పండిట్లపై జరిగిన దుర్ఘటనపై పలువురు స్థానికులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.

హిందూ - ముస్లిం అనే తేడాలు లేకుండా తామంతా ఒకప్పుడు కలిసి మెలిసి జీవించేవారమని.

కాశ్మీర్‌లో తిరిగి ప్రశాంత వాతావరణం నెలకొనాలని స్థానికులు కోరుతున్నారు.

వైరల్ వీడియో: రాజుల కాలంలో రాణుల అండర్‌వేర్‌పై ఆసక్తికర చర్చ