మహాత్మునికి అరుదైన గౌరవం: గాంధీ స్మారక నాణెం ముద్రించనున్న బ్రిటన్

కేవలం సత్యం, అహింస ఆయుధాలుగా రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి భరత మాతకు దాస్య విముక్తిని కలిగించారు జాతిపిత మహాత్మా గాంధీ.

భారత స్వాతంత్ర సంగ్రామాన్ని చారిత్రక దృష్టికోణంతో పాటుగా సామాజిక దృష్టికోణంతో పరిశీలించినట్లయితే గాంధీకి ముందు.

గాంధీ తర్వాత అన్నట్లుగా ఉద్యమ తీరుతెన్నులు మారిపోయాయి.గాంధీ నాయకత్వంలో నడిచిన స్వాతంత్ర సమరం సామాజిక, రాజకీయ కోణాలను కలుపుకుని ఒక విలక్షణమైన తాత్వికతతో ముందుకు సాగింది.

20వ శతాబ్ధి రాజకీయ నాయకుల్లో అత్యధికంగా మానవాళిని ప్రభావితం చేసిన నాయకుడిగా పలు సర్వేలు గాంధీని పేర్కొన్నాయి.

ఈ క్రమంలో ఆయనకు బ్రిటన్ ప్రభుత్వం అరుదైన గౌరవం కల్పించనుంది.మహాత్ముడి జ్ఞాపకార్థం స్మారక నాణెన్ని ముద్రించాలని బ్రిటన్ ప్రభుత్వం భావిస్తోంది.

"""/"/ నల్ల జాతీయులు, ఆసియన్లు, ఇతర మైనారిటీలు వివిధ రంగాల్లో చేసిన కృషికి గుర్తింపునిచ్చేందుకు తగిన చర్యలు తీసుకోవాలని బ్రిటీష్ ఆర్ధిక మంత్రి రుషి సునక్ ఓ లేఖలో రాయల్ మింట్ అడ్వయిజరీ కమీటీ (ఆర్ఎంఏసీ)ని కోరారు.

ఈ విషయాన్ని యూకే ట్రెజరీ శనివారం ఒక ఈమెయిల్ ప్రకటనలో తెలిపింది.ఆర్ఎంఏసీ అనేది బ్రిటన్ యొక్క ఆర్ధిక మంత్రి ఛాన్సలర్ ఆఫ్ ది ఎక్స్‌చెకర్‌కు నాణేల కోసం ఇతివృత్తాలు, నమూనాలను సిఫారసు చేసే నిపుణులతో కూడిన స్వతంత్ర కమిటీ.

రిషి సునక్ విజ్ఙప్తి నేపథ్యంలో మహాత్మాగాంధీని స్మరించుకునేందుకు ఓ నాణెం విడుదల చేయడంపై పరిశీలిస్తోందని ఆర్ఎంఏసీ పేర్కొంది.

విద్యార్థినికి అసభ్యకరమైన మెసేజ్‌లు పంపిన ఉపాధ్యాయుడిని చితకబాదిన తల్లిదండ్రులు