100 ఏళ్లనాటి ప్రేమలేఖ వైరల్.. తన ప్రేయసిని ఎలా వర్ణించాడంటే?

ప్రేమ అనేది ఎంత గొప్పదో మనందరికీ తెలుసు.ఈ ప్రేమలో పడితే ఎంతటి వారు అయినా ఆ ప్రేమకు దాసులు అవ్వాల్సిందే.

ఈ ప్రేమ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది.ప్రేమలో ఒక్కసారి పడ్డారంటే వారికీ ఎవ్వరినైనా ఎదిరించే ధైర్యం వస్తుంది.

అది ప్రేమలో ఉన్న శక్తి.ప్రేమ అనేది పూర్వపు రోజుల్లో అయినా.

టెక్నాలజీ పెరిగిన ఈ రోజుల్లో అయినా ఒకేలాగా ఉంటుంది.ప్రేమకు వయసు, కులం, మతం అనే తేడా ఉండదని కవులు చక్కగా వర్ణించి మరి చెబుతారు.

మరి ఇలాంటి ప్రేమను వ్యక్తపరచాలంటే ఇప్పటి రోజుల్లో అయితే సోషల్ మీడియా ఉంది.

దీని ద్వారా ఎక్కడ ఉన్న వారిని చిటికెలో కనిపెట్టి వారికీ సందేశం పంపవచ్చు.

కానీ పూర్వపు రోజుల్లో అలా ఉండేది కాదు.అప్పుడు ఇంత టెక్నాలిజీ లేదు.

అందుకే ప్రేయసి ప్రియులు వారి ప్రేమను ప్రేమ లేఖల ద్వారా వ్యక్తపరిచే వారు.

అలాంటి ఒక 100 ఏళ్ల నాటి ప్రేమ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ ప్రేమ లేఖ లో ఆ ప్రియుడు తన ప్రేయసి పై ఉన్న ప్రేమను ఎంత బాగా వ్యక్తపరిచాడో.

ఈ ప్రేమ లేఖ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది. """/"/ ''నా ప్రియాతి ప్రియతమా.

ప్రతి ఉదయం నన్ను నువ్వు చూడడానికి ప్రయత్నిస్తావా.ఈ ప్రేమ మన మధ్య రహస్యంగా ఉండాలి.

ఎందుకంటే నీకు ఇప్పటికే పెళ్లి అయింది కదా.అది వేరే సమస్యలకు దారి తీస్తుందేమో.

నువ్వు నన్ను చూడాలని, కలవాలని ప్రతి రోజు అనవద్దు.కానీ నన్ను కలవాలని అనుకుంటే మాత్రం ట్రామ్ కార్నర్ వద్ద అర్ధరాత్రి కలుద్దాం.

త్వరలో మళ్ళీ కలుసుకుందాం.ఇట్లు.

నీ ముద్దుల ప్రియుడు రొనాల్''అని వ్రాసి ఉంది.అప్పట్లోనే తన ప్రేమను ఎంత బాగా వ్యక్తపరిచాడో అని కామెంట్స్ చేస్తున్నారు.

సుమారు 100 ఏళ్ల నాటి ప్రేమలేఖ ఇది. """/"/ బ్రిటన్ కు చెందిన డాన్ కార్న్స్ అనే మహిళ తన పాత ఇంట్లో ఉంటుంది.

ఆ ఇల్లు సుమారు వంద ఏళ్ల నాటిది.ఆ ఇంట్లో ఫ్లోర్ టైల్స్ మిగిలిపోతే బాగుచేయిస్తుండగా ఈ లెటర్ ఆమెకు కనిపించింది.

ఆ మహిళా ఆ లెటర్ ను సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్త వైరల్ అయ్యింది.

ఇది సుమారు 1917 ప్రాంతంలో రాసి ఉంటారని ఎట్టకేలకు కనిపెట్టారు.

నా ఒంటి రంగును చూసి నేనెప్పుడూ గర్వపడతాను : అర్చన