భారత్‌కు నీరవ్ మోడీ అప్పగింత... తీర్పు రిజర్వ్ చేసిన యూకే కోర్ట్, ఉత్కంఠ

భారతదేశంలో ఎన్నో నేరాలు, దారుణాలకు పాల్పడిన వారు వివిధ దేశాల్లో ఆశ్రయం పొందుతున్న సంగతి తెలిసిందే.

వీరిలో ఉగ్రవాదులు, గ్యాంగ్‌స్టర్లు, అండర్ వరల్డ్ డాన్‌లు, ఆర్ధిక నేరగాళ్లు వున్నారు.దావూద్ ఇబ్రహీం నుంచి విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, మొహుల్ చోక్సీ వంటి వారు పలు దేశాల్లో తలదాచుకుంటున్నారు.

వీరిని స్వదేశానికి రప్పించడానికి భారత దర్యాప్తు సంస్థలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి.వీరందరిలోకి నీరవ్ మోడీ వ్యవహారం దేశవ్యాప్తంగా కలకలం రేపింది.

నీరవ్ మోడీని భారతదేశానికి అప్పగింతకు సంబంధించి బుధవారం జరిగిన విచారణ సందర్భంగా లండన్ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.

సాధ్యమైనంత త్వరగా వెలువరిస్తామని పేర్కొంది.పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను 2 బిలియన్ డాలర్ల మేర మోసం చేసి యూకేకు పారిపోయిన కేసులో నీరవ్ మోడీ అభియోగాలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

అతనిని భారతదేశానికి రప్పించాలని మన దర్యాప్తు ఏజెన్సీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.అయితే నీరవ్ మోడీ డిప్రెషన్‌లో వున్నారని.

ఆయనను భారత్‌కు అప్పగిస్తే ఆత్మహత్య చేసుకునే అవకాశం వుందని మానసిక వైద్యులు లండన్ హైకోర్టుకు తెలియజేశారు.

కాగా.భారత్‌లోని జైళ్లలో సరైన సదుపాయాలు లేవని నీరవ్ భయపడుతున్నారని ఆయన తరపు న్యాయవాదులు గతంలోనే చెప్పిన సంగతి తెలిసిందే.

నీరవ్‌ను అరెస్ట్ చేస్తే ముంబైలోని ఆర్డర్ రోడ్డు జైల్లో వున్న బ్యారెక్ నెంబర్ 12లో వుంచుతారనే ప్రచారం జరిగింది.

"""/"/ అసలేంటీ వివాదం: పీఎన్‌బీలో నీరవ్ మోడీ.అతని మామ మెహుల్ చోక్సీలు కలిసి రూ.

13,578 కోట్ల మోసానికి పాల్పడిన సంగతి తెలిసిందే.ఈ విషయాన్ని భారత దర్యాప్తు సంస్థలు కనిపెట్టడానికి ముందు నీరవ్ మోడీ విదేశాలకు పారిపోయారు.

ప్రస్తుతం లండన్‌లో వుంటున్న ఆయనను భారత్‌కు రప్పించేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి.పీఎన్‌బీ స్కామ్‌లో నీరవ్, చోక్సీలు కలిపి 25 మందిపై ఛార్జీషీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

భారతీయులకు ఇజ్రాయెల్ గుడ్‌న్యూస్ .. అందుబాటులోకి ‘ఈ-వీసా’, దరఖాస్తు ఎలా అంటే?