ఏం అదృష్టం.. 30ఏళ్లు ప్రతినెలా రూ.10 లక్షలు పొందేలా లాటరీ గెలిచిన మహిళ..
TeluguStop.com
యూకేకి చెందిన డోరిస్ స్టాన్‌బ్రిడ్జ్( Doris Stanbridge ) అనే 70 ఏళ్ల వృద్ధురాలిని అదృష్టం లాటరీ రూపంలో పలకరించింది.
దాంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.సెట్ ఫర్ లైఫ్ లాటరీలో( Set For Life Lottery ) భారీ బహుమతిని గెలుచుకున్నట్లు తెలుసుకున్నాక ఆమె ఎంతో సంతోషించింది.
ఇల్లు బాగా పాతబడి కొన్ని చిన్న సాలెపురుగులు ఆమె కిచెన్ లోకి అప్పుడప్పుడు వచ్చేవి.
యూకేలో( UK ) డబ్బు సాలెపురుగులుగా పిలిచే మనీ స్పైడర్స్ అదృష్టానికి సంకేతమని ఆమె నమ్మింది.
అందుకే లాటరీ కొనాలని బలంగా నిర్ణయించుకుంది.తరువాత లాటరీ మొబైల్ యాప్‌లో సెట్ ఫర్ లైఫ్ టిక్కెట్‌ను కొనుగోలు చేసింది.
ఆమె తన 70వ పుట్టినరోజు వరకు తన టిక్కెట్‌ను చెక్ చేయలేదు.సరిగ్గా బర్త్ డే నాడు ఈమెయిల్స్ చెక్ చేస్తుండగా నేషనల్ లాటరీ నుంచి "మీరే విన్నర్" అని ఈమెయిల్ వచ్చింది.
ఆమె యాప్‌కి లాగిన్ చేసి తన టికెట్‌కే లాటరీ తగినట్టు తెలుసుకొని సర్‌ప్రైజ్ అయ్యింది.
ఈ లాటరీ విజయంలో భాగంగా ఆమె 30 సంవత్సరాల పాటు ప్రతి నెలా £10,000 గెలుచుకుంది.
అంటే భారతీయ కరెన్సీలో నెలకు 10 లక్షల రూపాయలు( 10Lakh Rupees ) చొప్పున 30 ఏళ్ల పాటు ఆమె డబ్బు పొందుతుంది.
అయితే ఈ లాటరీ గెలుచుకున్నట్లు తాను అసలు నమ్మలేదని, చివరికి తన భర్త వచ్చి అది నిజమేనని చెప్పేదాకా తనలో నమ్మకం కలగలేదని ఆమె చెప్పింది.
తర్వాత షాంపైన్ బాటిల్‌తో ఆమె ఈ అదృష్టాన్ని సెలబ్రేట్ చేసుకుంది.30 ఏళ్లుగా ప్రతి నెలా ఆ డబ్బు అందడం తనకు ఇప్పటికీ వింతగా అనిపిస్తోందని చెప్పింది.
"""/" /
మరికొద్ది రోజులు రిటైరయ్యే ఆలోచన లేదని, అయితే కొన్ని నెలల్లో పని మానేసి, రెండు వారాల ముందే రిటైర్ అయిన తన భర్తతో కలిసి రిటైర్మెంట్‌ను( Retirement ) ఎంజాయ్ చేస్తానని చెప్పింది.
ఇప్పుడు కలిసి రిటైర్ అయ్యి సరదాగా గడపవచ్చని చెప్పింది.ఆమె తన మొదటి లాటరీ డబ్బులతో కొత్త బెడ్, ఎయిర్ ఫ్రైయర్ వంటి కొన్ని కొత్త వస్తువులను కొనుగోలు చేసినట్లు కూడా చెప్పింది.
తన ముగ్గురు కుమార్తెలు, ఏడుగురు మనవరాళ్లతో సహా తన పెద్ద కుటుంబంతో కలిసి కార్న్‌వాల్‌కు విహారయాత్రకు కూడా వెళ్లింది.
ఇదొక అద్భుతమైన యాత్ర అని, తాము ఎంతో ఆనందించామని చెప్పింది. """/" /
లాటరీ సంస్థ తనతో పాటు విదేశీ విహారయాత్రకు( Foreign Tour ) వెళ్లేందుకు కుటుంబసభ్యులకు ఆఫర్ ఇచ్చిందని కూడా ఆమె వెల్లడించింది.
స్పెయిన్‌లో( Spain ) కొలను, సూర్యరశ్మి బాగా అందేలా ఉన్న విల్లా కోసం తాను వెతుకుతున్నానని చెప్పింది.
తన మనవడు విమానంలో ప్రయాణించడం ఇదే తొలిసారని, దాని గురించి అతను చాలా ఎగ్జైట్ అయ్యాడని చెప్పింది.
ఈ విజయం తన జీవితాన్ని మార్చివేసిందని, సంతోషాన్ని కలిగించిందని చెప్పింది.తనకు 100 ఏళ్లు వచ్చే వరకు జీవించాలని, ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలని ఉందని చెప్పింది.
తనకు అదృష్టాన్ని తెచ్చిపెట్టిన డబ్బు సాలెపురుగులకు కృతజ్ఞతలు తెలుపుతూ, వాటిని ఎప్పుడూ గుర్తుంచుకుంటానని చెప్పింది.
పారడైజ్ సినిమాతో ఆ రికార్డ్ క్రియేట్ చేయబోతున్న న్యాచురల్ స్టార్.. ఏమైందంటే?