యూకే: వున్నవి చాలవన్నట్లు .. కొత్త తలనొప్పి, బోరిస్ జాన్సన్‌ను వివాదంలో పడేసిన మంత్రి

కర్మ బాగోనప్పుడు కర్రే పామై కరుస్తుందన్నట్లు.బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ టైం అస్సలు బాగోలేదనుకుంటా.

ఇప్పటికే కోవిడ్, లాక్‌డౌన్ సమయంలో ఆయనతో పాటు పీఎంవో కార్యాలయ సిబ్బంది పార్టీ చేసుకున్నారంటూ బోరిస్ జాన్సన్‌పై ప్రతిపక్షాలు, మీడియా దుమ్మెత్తి పోస్తున్నాయి.

దీనిపై ప్రధాని ఎన్నిసార్లు వివరణలు ఇచ్చినా ఫలితం శూన్యం.ఇవన్నీ కలిసి బోరిస్ జాన్సన్‌ పదవికి చేటు చేస్తాయా అన్న వాదనలు వినిపిస్తున్నాయి.

తాజాగా తన కేబినెట్‌కు చెందిన మంత్రి చేసిన ఘనకార్యం ప్రధానిని చిక్కుల్లో పడేసింది.

వివరాల్లోకి వెళితే.బాధ్యతల గల పదవిలో వుండి, నలుగురికి ఆదర్శంగా వుండాల్సిన యూకే విదేశాంగ శాఖ సెక్రటరీ లిజ్ ట్రస్‌ హౌస్ ఆఫ్ కామన్స్‌లో తోటి సభ్యుల మధ్య మాస్కు పెట్టుకోకుండా కూర్చొన్నారు.

ఇది జరిగిన గంటల వ్యవధిలోనే ఆమెకు కరోనా పాజిటివ్‌గా తేలింది.హౌస్ ఆఫ్ కామన్స్‌లో లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘనలపై క్షమాపణలు కూడా చెప్పారు బోరిస్ జాన్సన్.

ఆ కాసేపటికే లిజ్ వ్యవహారం బయటకు రావడంతో బ్రిటన్ మీడియా ప్రభుత్వంపై విరుచుకుపడుతోంది.

మంగళవారం నాడు ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీని కలిసేందుకు ప్రధాని బోరిస్ జాన్సన్‌తోపాటు వెళ్లే బృందంలో ఆమె పేరు కూడా ఉండటం గమనార్హం.

అయితే ప్రస్తుతం కరోనా బారినపడటంతో లిజ్ ఈ భేటికి దూరంగా వుండనున్నారు.కాగా.

గతేడాది మేలో దేశంలో కఠిన లాక్‌డౌన్ అమల్లో వుండగా బోరిస్ జాన్సన్ సహా పలువురు అధికారులు డౌనింగ్ స్ట్రీట్‌లోని అధికారిక నివాసంలో విందుల్లో మునిగి తేలడం యూకే రాజకీయాలను వేడెక్కించింది.

దీనిపై స్వయంగా ఆయన క్షమాపణలు చెప్పినప్పటికీ వివాదానికి తెరపడటం లేదు.ఇందుకు గాను బోరిస్ జాన్సన్ రాజీనామా చేయాలంటూ ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి.

అదే ఏడాది ఏప్రిల్‌ 17న కూడా ఆయన కార్యాలయ సిబ్బంది విందు, వినోదాల్లో మునిగిపోయారని ఇటీవల ‘డైలీ టెలిగ్రాఫ్‌’ ఓ కథనం వెలువరించడం సంచలనం సృష్టించింది.

అంతేకాదు.2020 జూన్ 19న తన పుట్టిన రోజు సందర్భంగానూ బోరిస్‌ జాన్సన్‌ ఆంక్షలు ఉల్లంఘించి ఓ పార్టీ నిర్వహించినట్లు మరోసారి ఆరోపణలు రావడం కలకలం రేపింది.

వెయిట్ లాస్ కు తోడ్పడే బెస్ట్ స్మూతీ ఇది.. వారానికి 2 సార్లు తీసుకున్న మస్తు లాభాలు!