వైరల్ వీడియో: చెత్త డబ్బాలో ప్రయాణించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసిన ఘనుడు…!

బ్రిటన్ దేశానికి చెందిన ఇంజనీర్ దెబ్బకి మోటర్ ని అమర్చి అందులో 65 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేసి వరల్డ్ రికార్డును బ్రేక్ చేశాడు.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.ఆండీ అనే వ్యక్తి తన ఇంట్లో పాతబడిన డస్ట్ బిన్ ని చూసి దాన్ని ఏదో లాగా ఉపయోగించాలని ఆలోచించాడు.

అయితే ఇలా ఆలోచిస్తున్న నేపథ్యంలో ఆ చెత్తబుట్టను మోటార్ బైక్ లా తయారు చేసుకుంటే ఉపయోగపడుతుందని భావించాడు.

అనుకున్నది అనుకున్నట్టుగానే మోటర్ బైక్ ఇంజన్ సీట్ స్టీరింగ్ గేర్ బాక్స్ అన్నిటినీ అందులో అమర్చాడు.

ఇలా చేసిన తర్వాత అతనిలాగే ప్రపంచంలో మరో ఎవరైనా ఈ విషయంపై కష్టపడ్డారో అనే విషయాన్ని తెలుసుకుందామని అంతర్జాలంలో వెతకగా చివరికి గిన్నిస్ బుక్ రికార్డ్ వారికి తన విషయాన్ని తెలపగా గిన్నిస్ బుక్ రికార్డ్ ప్రతినిధులు 48 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో ప్రయాణిస్తే సరికొత్త ప్రపంచ రికార్డును తన సొంతమవుతుందని తెలియజేశారు.

ఇక అంతే తాజాగా ఎల్వింగ్టన్ ఎయిర్ ‌ఫీల్డ్‌ లో సరికొత్త రికార్డు నమోదయింది.

ఈ కార్యక్రమం సంబంధించి ప్రముఖ రేసింగ్ కంపెనీ స్ట్రైట్ లైనర్స్ పూర్తి ఏర్పాట్లు చేసింది.

గిన్నిస్ రికార్డులో పాటిస్పేట్ చేస్తున్న నేపథ్యంలో ఆండీ ఏకంగా ఒక గంటకు 65 కిలోమీటర్ల వేగంతో తాను తయారు చేసిన చెత్తబుట్ట బైకు తో దూసుకెళ్ళాడు.

ఇంకేముంది తాను గిన్నిస్ బుక్ రికార్డ్స్ లో అనుకున్నట్టుగానే పేరు సంపాదించాడు.ఇందుకు రికార్డ్ సాధించాక ఆండీ మాట్లాడుతూ.

'ఇదో గొప్ప రోజు.నేను అనుకున్న దానికంటే ఎక్కువ వేగంతో ప్రయాణించినందుకు చాలా ఆనందంగా ఉందంటూ టార్గెట్ పూర్తి అవగానే తనలో ఏదో తెలియని టెన్షన్ ఏర్పడిందని తెలియజేశాడు.

అయితే టార్గెట్ పూర్తి అయిన తర్వాత తాను గిన్నిస్ బుక్ ప్రతినిధుల వైపు చూడగా వారందరూ సూపర్ అని పొగిడారు.

దాంతో నా టెన్షన్ మొత్తం పోయింది అని తెలియజేశాడు.అయితే ఇంతటి అద్భుతాన్ని సృష్టించిన ఆండీ రెండు నెలల క్రితం చనిపోయిన తన ఫ్రెండ్ కి ఆ వాహనాన్ని అంకితం చేశాడు.

అయితే ఈ డస్ట్ బిన్ మోటార్ బైక్ కి ఆండీ ఏకంగా గంటకు 96 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలిగే మోటర్ ను సెట్ చేశాడు.

వివేక్ రామస్వామి, మస్క్‌ల రూపంలో బీజింగ్‌కు ముప్పు .. చైనా విద్యావేత్త హెచ్చరిక