యూకే ఫ్యామిలీ వీసా : కొత్త ప్రధాని కీర్ స్టార్మర్ సంచలన నిర్ణయం.. భారతీయులకు బిగ్ రిలీఫ్
TeluguStop.com
యూకే కొత్త ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన కీర్ స్టార్మర్ ప్రభుత్వం ఫ్యామిలీ వీసాపై సంచలన నిర్ణయం తీసుకుంది.
బ్రిటీష్ పౌరులు( British Citizens ), అక్కడ శాశ్వత పౌరసత్వం పొందిన విదేశీయులు తమ బంధువులను కుటుంబ వీసాపై తీసుకొచ్చేందుకు రిషి సునాక్( Rishi Sunak ) ప్రభుత్వం వార్షికాదాయ పరిమితిని పెంచింది.
ఈ నేపథ్యంలో లేబర్ పార్టీ నేతృత్వంలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని పక్కనపెట్టింది.
దీంతో వార్షికాదాయం 38 వేల పౌండ్లు (భారత కరెన్సీలో రూ.41.
5 లక్షలు) ఉండాలన్న నిబంధనకు తెరపడినట్లయ్యింది.స్టార్మర్ ప్రభుత్వ నిర్ణయంతో యూకేలో నివసిస్తున్న భారతీయులకు ఉపశమనం కలిగించింది.
ఫ్యామిలీ వీసా కేటగిరిలో ( Family Visa Category )ఇండియన్స్ భారీగా లబ్ధి పొందుతారు.
గతేడాది 5,248 మంది ఈ వీసాను పొందినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి.సాధారణంగా బ్రిటన్‌లో ఎవరైనా ఫ్యామిలీ వీసాకు స్పాన్సర్ చేయాలంటూ వారి వార్షికాదాయం 29 వేల పౌండ్లుగా ఉండాలి.
2025 నుంచి దీనిని 38,700 పౌండ్లకు పెంచాలని నాటి రిషి సునాక్ ప్రభుత్వం నిర్ణయించింది.
వలసలను నియంత్రించేందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా అప్పట్లో ప్రభుత్వం వివరణ ఇచ్చింది.
"""/" /
కుటుంబ వార్షికాదాయ పరిమితిని 29 వేల పౌండ్ల నుంచి 38,700 పౌండ్లకు పెంచుతూ గతంలో తీసుకున్న నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు బ్రిటన్ హోంమంత్రి యెవెట్ కూపర్ ప్రకటించారు.
వలసలకు తమ ప్రభుత్వం కొత్త విధానాన్ని అనుసరిస్తుందని, విదేశీ కార్మికులను నియమించుకోవడానికి స్థానికుల నైపుణ్యాలను మెరుగుపరచడంపై దృష్టి పెడతామని కూపర్ స్పష్టం చేశారు.
"""/" /
ఇదిలాఉండగా.వలస వ్యతిరేక గ్రూపులు చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారడంతో యూకేలో పరిస్ధితులు అదుపుతప్పాయి.
పలు నగరాలు, పట్ణణాలకు నెమ్మదిగా విస్తరిస్తుండటంతో యూకేలోని భారతీయుల భద్రతపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది.
ఈ మేరకు లండన్‌లోని భారత హైకమీషన్ అడ్వైజరీ జారీ చేసింది.యూకేలోని హైకమీషన్ కార్యాలయం పరిస్ధితిని నిశితంగా గమనిస్తోందని, భారతీయ పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
బోయపాటి శ్రీను బాలయ్య బాబు కాంబోలో వస్తున్న సినిమాలో విలన్ గా చేస్తున్న స్టార్ హీరో…