పాఠశాలను మూసివేత నుంచి రక్షించిన ఎన్ఆర్ఐ .. నా దేవాలయమంటూ ఎమోషనల్

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం విదేశాలకు వెళ్లిన ప్రవాస భారతీయులు జన్మభూమికి సేవ చేస్తూనే ఉన్నారు.

భారత్‌లో సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు ఇక్కడ కంపెనీలు, పరిశ్రమలు స్థాపించి వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారు.

ఆపదలో ఎవరైనా ఉన్నట్లు తెలిస్తే చాలు ఆగమేఘాల మీద స్పందిస్తున్నారు.తాజాగా పంజాబ్‌లోని బంగా శివారులోని సల్హ్ కలాన్ ( Salh Kalan, A Suburb Of Banga, Punjab )అనే గ్రామంలో ఉన్న విద్యార్ధుల సంఖ్య తక్కువగా ఉండటంతో ప్రభుత్వ పాఠశాలను కొన్నేళ్లపాటు మూసివేయాలని నిర్ణయించారు.

ఈ వార్త యూకేకు చెందిన 70 ఏళ్ల షమీందర్ సింగ్ గార్చాకు ( Shaminder Singh Garcha )చేరడంతో అతను పాఠశాలను రక్షించాలని నిర్ణయించుకున్నారు.

"""/" / ఈ పాఠశాల నా దేవాలయమని, అది శిథిలమై మూతపడటం నేను చూడలేనని, నా ఎన్ఆర్ఐ సోదరులు, మిత్రుల సాయంతో రూ.

40 లక్షలు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు గార్చా తెలిపారు.భవనం కోసం రూ.

కోటికి పైగా ఖర్చు చేశానని.ఖరీదైన తరగతులను నిర్మించామని ఆయన వెల్లడించారు.

మా ప్రయత్నాలు ఫలించి విద్యార్ధుల సంఖ్య ఇప్పుడు 60కి పైగా చేరుకుందని షమీందర్ సింగ్ తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం కూడా దాదాపు రూ.20 లక్షల నిధులను మంజూరు చేసిందని ఆయన పేర్కొన్నారు.

"""/" / ఐఏఎస్ అధికారి కృష్ణన్ కుమార్ ( IAS Officer Krishnan Kumar )గతంలో పాఠశాలను సందర్శించి భవనం సురక్షితం కాదని నివేదిక ఇచ్చారని, దీంతో తాము పాత భవనాన్ని కూల్చివేసి మళ్లీ నిర్మించాల్సి వచ్చిందని ఎన్ఆర్ఐ చెప్పారు.

మేం ఏం చేసినా ప్రభుత్వ మార్గనిర్దేశం ప్రకారం జరుగుతుందని షమీందర్ తెలిపారు.ఈ పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారని.

పక్కనే ఉన్న సాల్హ్ ఖుర్ద్ గ్రామంలో దాదాపు 500 గజాల దూరంలో మరో ప్రభుత్వ పాఠశాల ఉందని వెల్లడించారు.

ఇందులో 25 మంది విద్యార్ధులు, ముగ్గురు ఉపాధ్యాయులు ఉన్నారని చెప్పారు.ఈ రెండు పాఠశాలలను విలీనం చేస్తే ప్రభుత్వానికి ఖర్చు తగ్గుతుందని, మెరుగైన విద్యను అందించవచ్చని షమీందర్ పేర్కొన్నారు.

తాము ఇప్పటికే గ్రామీణ మహిళలకు కుట్టుపని, కంప్యూటర్ విద్యలో నైపుణ్యాలను అందిస్తున్నామని ఆయన చెప్పారు.

నాని ప్యారడైజ్ సినిమాలో మలయాళం స్టార్ హీరో…