ఎన్నారైల కి కేంద్రం గుడ్ న్యూస్

భారత ఎన్నారైలకి కేంద్రం తీపి కబురు అందించింది.ఇకపై భారత్ లో మూడు నెలలు ఉండండి చాలు ఆధార్ ఇచ్చేద్దాం అంటూ ప్రకటన విడుదల చేసింది.

భారత్ లో ఎటువంటి అవసరానికైనా సరే ఆధార్ తప్పని సరి అని అందరికి తెలిసిందే.

ఈ క్రమంలోనే ఆధార్ కార్డు పొందే విషయంలో ఎన్నారైలు ఇబ్బందులు పడే వారు.

ఎటువంటి లావాదేవీలు జరగాలన్నా ఆధార్ తప్పని సరి అయ్యింది.గతంలో ఎన్నారైల కి ఆధార్ కార్డు కావాలంటే తప్పకుండా భారత్ లో 180 రోజులు ఉండాల్సి వచ్చేది.

దాంతో ఎన్నారైలకి సెలవలు దొరకక ఎన్నో ఇబ్బందులు పడే వాళ్ళు.అయితే ఎంతో మంది విజ్ఞప్తుల మేరకు కేంద్రం ఆధార్ కార్డు కావాలంటే కేవలం 3 నెలలు ఉంటే చాలని మార్గ దర్సకాలు జారీ చేసింది.

"""/"/ తాజా ఆదేశాల మేరకు యూఐడీఏఐ సాఫ్ట్ వేర్ లో మార్పులు చేస్తున్నామని తెలిపారు.

అంతేకాదు ఇక నుంచీ విదేశాల్లో ఉండగానే పాస్పోర్ట్ ఆధారంగా ఆధార్ కార్డ్ టైం స్లాట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తాము కార్డ్ తీసుకునే విషయాన్ని ఆ సమయంలోనే తెలుపాలని తెలిపారు.

స్వదేశానికి వచ్చిన సమయం మొదలు 90 రోజుల్లో ఆధార్ అందిస్తామని ప్రకటించారు.

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ పాలన..: సీఎం జగన్