ఆధార్‌ కార్డులో ఇక ఆ రెండు సేవలు ఉండవు!

ఆధార్‌ కార్డు అన్నింటితో లింక్‌ అయి ఉంటుంది.తాజాగా ఆధార్‌ కార్డు దారులకు యూఐడీఏఐ ఓ కీలకమైన విషయాన్ని తెలిపింది.

తాము ఆధార్‌ కార్డు ద్వారా అందిస్తున్న ఓ రెండు సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

అవేంటో తెలుసుకుందాం.ఈ మధ్య కాలంలో ఆధార్‌ కార్డులో ఏవైనా మార్పులు చేసుకోవాలన్నా పెద్ద సమస్యగా మారింది.

ఈ సేవా సెంటర్లలలో గంటల కొద్ది వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.బ్యాంకింగ్‌ కార్యకలాపాలకు కూడా ఆధార్‌ కార్డును అప్డేట్‌ చేసుకోవడం చాలా ముఖ్యం.

ముఖ్యంగా ఆధార్‌లో పేరు, ఫోటో, అడ్రస్‌ ఏవైనా వివరాలు మార్చడానికి లేదా అప్డేట్‌ చేయడానికి యూఐడీఏఐ అందించే అనేక సేవలు అందుబాటులో ఉన్నాయి.

కార్డుదారులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు క్రమం తప్పకుండా ఈ సేవలను అందిస్తోంది.

ఇటీవల యూఐడీఏఐ ఆధార్‌ కార్డుకు సంబంధించిన రెండు సేవలను నిలిపివేసింది.h3 Class=subheader-styleఅడ్రస్‌ ప్రూఫ్‌ వ్యాలిడేషన్‌ లెటర్‌/h3p ఇది ఆధార్‌ కార్డులో అడ్రస్‌ను అప్డేట్‌ చేయడానికి లేదా వ్యాలిడేషన్‌ లెటర్‌ చాలా ఉపయోగపడుతుంది.

కానీ, తాత్కాలికంగా యూఐడీఏఐ ఈ సేవలను నిలిపివేసింది.తదుపరి అప్డేట్‌ వరకు అడ్రస్‌ వ్యాలిడేషన్‌ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

ఈ అడ్రస్‌ వ్యాలిడేషన్‌ లెటర్‌ను యూఐడీఏఐ వెబ్‌సైట్‌ నుంచి తొలగించేసింది.ఇది ఆధార్‌ కార్డులో అడ్రస్‌ చేంజ్‌ చేసుకునేవారికి, ముఖ్యంగా అద్దె ఇళ్లలో ఉండేవారికి ఓ సమస్యగా మారింది.

ఎందుకంటే, అడ్రస్‌ మార్చడానికి ఇది ఓ ప్రూఫ్‌ వలె వారికి ఉపయోగపడేది. """/"/ H3 Class=subheader-styleఆధార్‌ రీప్రింట్‌ సేవలు/h3p యూఐడీఏఐ నిలిపివేసిన మరో సేవ ఇక పెద్ద సైజులో ఆధార్‌ కార్డు పొందలేరు.

కేవలం చిన్న సైజ్‌ ప్లాస్టిక్‌ కార్డు మాత్రమే జారీ చేయనున్నారు.వినియోగదారులు పీవీసీ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

లేదా ఆన్‌లైన్‌ ప్రింట్‌ తీసుకోవచ్చని యూఐడీఏఐ ట్వీటర్‌ ప్లాట్‌ఫాంలో తెలిపింది.

కొంచెం కంటెంట్ మీద ఫోకస్ పెట్టాండయ్య…లేకపోతే ఇక అంతే సంగతి…