ఆధార్ కార్డు అప్ డేట్ కి మరో మూడు నెలలు పెంచిన ఉడాయ్..!!
TeluguStop.com
భారతదేశంలో పౌరులకు ప్రభుత్వాలు ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు తప్పనిసరి చేయటం తెలిసిందే.
చాలావరకు ఆధార్ కార్డు ద్వారానే ప్రభుత్వ పథకాలు( Government Schemes).పొందుకొనే పరిస్థితి నెలకొంది.
ప్రభుత్వ ఫోటో గుర్తింపు కార్డ్ మాదిరిగా ఆధార్.చలామణి అవుతుంది.
భారతదేశంలో ఆధార్ ( Aadhaar )అనేది చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్.ఆధార్ కార్డులో పేరులో గాని అడ్రస్ లేదా మిగతా విషయాలలో ఎలాంటి తప్పులున్న.
చిక్కుల్లో పడినట్టే./BR
ఇదిలా ఉంటే.
ఉచితంగా ఆన్ లైన్ లో ఆధార్ వివరాలు.అప్ డేట్ చేసుకునేందుకు ఇచ్చిన గడువును భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ ( UIDAI ) మరోసారి పొడిగించింది.
నిన్నటి వరకు 2023 డిసెంబర్ 14 వరకు మాత్రమే ఉచితంగా ఆధార్ వివరాలను అప్ డేట్ చేసుకునేందుకు అవకాశం కల్పించగా తాజాగా మరో మూడు నెలలు గడువు పెంచింది.
దీంతో 2024 మార్చి 14 వరకు ఉచితంగా వివరాలను అప్ డేట్ చేసుకోవచ్చు.
ప్రజల నుంచి మంచి స్పందన వస్తూ ఉండటంతో గడువు పెంచుతున్నట్లు ఉడాయ్.స్పష్టం చేయడం జరిగింది.
అయితే పెంచిన గడుపు తర్వాత ఆధార్ డాక్యుమెంట్లను( Aadhaar Documents ) అప్ డేట్ చేసుకోవలసి వస్తే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
ఆధార్ కార్డు కోసం.పేరు నమోదు చేసుకున్న నాటి నుంచి పది సంవత్సరాలు పూర్తయిన వాళ్లు తగిన పత్రాలు సమర్పించి అందులో పొందుపరిచిన వివరాలను అప్ డేట్ చేసుకోవాలని ఉడాయ్.
గతంలో సూచించడం జరిగింది.ఇందుకోసం ఉడాయ్ వెబ్ సైట్ లో లాగిన్ అయ్యి వివరాలు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
వింటర్ లో సీజనల్ వ్యాధులకు దూరంగా ఉండాలనుకుంటే ఈ డ్రై ఫ్రూట్ ను మీరు తినాల్సిందే!