విడాకుల విషయం స్పందించిన ఊహా శ్రీకాంత్.. ఏమన్నారంటే?
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో కుటుంబ కథా చిత్రాలలో నటించి తనకంటూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సీనియర్ నటుడు శ్రీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
సుమారు వంద సినిమాలకు పైగా నటించి నటుడిగా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న శ్రీకాంత్ ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా విలన్ పాత్రలలోనూ అలాగే సహాయ నటుడు పాత్రలలో నటిస్తూ సందడి చేస్తున్నారు.
ఇక ఈయన తన కుమారుడు రోషన్ ను కూడా హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేశారు.
ఈ విధంగా సినిమా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న శ్రీకాంత్ తన సహనటి ఊహను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ దంపతులు వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నప్పటికీ వీరు విడాకులు తీసుకోబోతున్నారంటూ పెద్ద ఎత్తున విడాకుల గురించి వార్తలు వచ్చాయి.
అయితే ఇలా వీరి విడాకులు వార్తలు రావడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈ దంపతులు తమ విడాకులు గురించి వస్తున్న వార్తలకు స్పందించి క్లారిటీ ఇచ్చారు.
"""/"/
ఓ ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈ దంపతులు మా గురించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి మేం విడాకులు తీసుకోబోతున్నామని ఆర్థికపరమైన సమస్యలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి.
అయితే ప్రస్తుతం మేమిద్దరం షూటింగ్లో బిజీగా ఉన్నామని విడాకులు తీసుకోబోతున్నాం అంటూ వచ్చే వార్తలలో ఏ విధమైనటువంటి నిజం లేదు ఆ వార్తలు పూర్తిగా ఆ వాస్తవం అంటూ విడాకులు వార్తలకు చెక్ పెట్టారు.
దీంతో అభిమానులు సైతం కాస్త ఊపిరి పీల్చుకున్నారు.
ఎన్టీయార్ పాన్ ఇండియా డైరెక్టర్లనే ఎంచుకుంటున్నాడా..? కారణం ఏంటి..?