అమెరికాలో తెలుగు ఉగాది తీర్మానం..!

అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్ర సెనేట్ తెలుగు ఉగాది తీర్మానం చేసింది.ఏప్రియల్ 8, 2019 తారీఖు మధ్యాన్నం 2:23 గం లకి తెలుగువారందరి హర్షధ్వానాల మధ్య ఉగాది శుభాకాంక్షల తీర్మానం ఆమోదం అయ్యింది.

కాలిఫోర్నియా 16వ జిల్లా “బేకర్స్ ఫీల్ద్” సెనెట్ సభ్యురాలు, సెనేట్ మైనారిటీ నాయకురాలు అయిన సెనెట్ “షేనన్ గ్రొవర్” ఈ తీర్మానాన్ని కాలిఫోర్నియా రాజధాని నగరమైన శాక్రమెంటో లో జరిగిన సెనెట్ సభలో చదివి వినిపించారు.

ఆ తరువాత సెనెట్ సభ్యులు 38 మంది ఉగాది తీర్మానంను ఏకగ్రీవంగా ఆమోదించారు.

పలువురు సెనెట్ సభ్యులు తమ స్థానాలలో నుంచుని తెలుగువారందరికీ శుభాకాంక్షలు చెప్తూ కరచాలనం చేశారు.

కాలిఫోర్నియా రాష్ట్రంలో లక్ష మందికి పైగా తెలుగువారు ఉన్నారు, వారిలో 2000 మందికి పైగా విద్యార్ధులు మనబడి లో తెలుగు భాష నేర్చుకుంటున్నారని తెలిపారు.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ సెనేట్ మైనారిటీ నాయకురాలు అయిన “షేనన్ గ్రొవర్” తెలుగు వారందరితో ముచ్చటించారు.

తదుపరి సమావేశంలో చీర కట్టుకుని వస్తానని ఆమె తెలిపారు.భారత సంస్కృతిపై తనకు ఎంతో అభిమానం ఉందని ఆమె తెలిపారు.

ఈ కార్యక్రమానికి తెలుగు అసోసియేషన్ టాగ్స్ ప్రముఖ పాత్ర పోషించింది.

ఆర్య మూవీ లో ఈ షాట్ కోసం అల్లు అర్జున్ చేసిన పని తెలిస్తే ..?