పాఠశాలలో ఉగాది సంబరాలు

రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని ప్రతిభ విద్యాలయం ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో సోమవారం ముందస్తుగా ఉగాది సంబరాలు పాఠశాల కరస్పాండెంట్ కొడగంటి గంగాధర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు .

ఈ సందర్భంగా కొడగంటి గంగాధర్ మాట్లాడుతూ.హిందువుల అతిపెద్ద పండుగైన తెలుగు నూతన సంవత్సరం శ్రీ క్రోధి నామ సంవత్సరం ప్రారంభం కాబోతుంది.

జీవితంలో కష్టాల, సుఖాలు మరియు బాధలు ఉంటాయి.అయితే ఈ ఉగాది మీ జీవితంలో సుఖ సంతోషాలు మరియు చదువు, ఆరోగ్యం, ఆయుష్యు అందివ్వడానికి ఉగాది పండుగ జరుపుకుంటారు.

మన పాఠశాలలో ముందస్తుగా ఉగాది వేడుకలు నిర్వహించడం జరిగిందని తెలిపారు.ఇట్టి కార్యక్రమంలో ఉపాధ్యాయులు .

విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

డైలీ మార్నింగ్‌ పాలల్లో ఈ పొడిని కలిపి తీసుకుంటే వెయిట్ లాస్ తో సహా అదిరే బెనిఫిట్స్ మీ సొంతం!