జపాన్ స్టేడియం వద్ద దర్శనమిచ్చిన యు.ఎఫ్ .ఓ!

జపాన్ లోని ఓ స్టేడియం బయట ఆకాశంలో ఏలియన్స్ వాడుతారు అనుకునే వాహనం లాంటిది కనిపించింది.

ఇపుడు ఇది ప్రపంచమంతటా ఒక హాట్ టాపిక్ లా మారింది.అసలు నిజంగా ఏలియన్స్ ఉన్నాయా? ఒకవేళ ఉంటే ఎక్కడ ఉన్నాయి, ఇప్పటివరకు ఎందుకు కనిపించలేదు? నాసా మొదట్లో చంద్రుడిపై మనిషిని పంపిన తర్వాత మళ్ళీ ఇన్నాళ్లు ఎందుకు పంపలేదు? అసలు అక్కడ ఏం జరిగింది? భారతదేశం చంద్రయాన్ ని పంపిన తరువాత.

ఇప్పుడు చైనా కూడా చంద్రుడిపైకి ఉపగ్రహం పంపాలని నిర్ణయించుకుంది, తాజాగా ఈ ప్రయత్నాలు అమెరికా కూడా మోదలుపెట్టింది.

ఇదిలా ఉండగా టోక్యో నుండి 29kmల దూరంలో ఉన్న ఒక స్టేడియం బయట జపాన్ జాతీయ పతాకం చుట్టూ UFO తిరుగుతూ కనిపించింది.

అయితే అది ఒకటి కాదని సుమారు 5 UFO లు తిరుగుతున్నాయని జనాలు మాట్లాడుకుంటున్నారు.

దీనికి కొద్ది రోజుల ముందే స్పెయిన్ లోని బేస్క్యూ అనే నగరంలో జుమర్రగ అనే కొండపై అచ్చం అలానే UFO కనిపించింది.

రష్యా లో కూడా ఇలాగే సాసర్ ఆకారం లో ఉన్న ఒక షిపని రాకెట్ వేగంతో చక్కర్లు కొట్టింది.

ఇది ఎంతమేరకు నిజమనేది జపాన్ ప్రభుత్వం స్పందిస్తేనే ఒక క్లారిటీ వస్తుంది.