హీరోగా సినిమాలకి దూరం కానున్న ఉదయనిధి స్టాలిన్
TeluguStop.com
కోలీవుడ్ లో హీరోగా రాణిస్తున్న డిఏంకే పార్టీ అధినేత స్టాలిన్ వారసుడు, కరుణానిధి మనవడు ఉదయనిది స్టాలిన్.
నిర్మాతగా ఎంట్రీ ఇచ్చి తరువాత హీరోగా ఒకేఒకే సినిమాతో తెరంగేట్రం చేసిన ఉదయనిది స్టాలిన్ చాలా వేగంగానే తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు.
మరీ మాస్ యాక్షన్ సినిమాలు అని కాకుండా తన బాడీ లాంగ్వేజ్ కి సరిపోయే విధంగా ఫన్ ఎంటర్టైన్మెంట్ జోనర్ లో ఎక్కువగా ఉదయనిది సినిమాలు చేస్తూ వచ్చాడు.
మరో వైపు తండ్రి తర్వాత డిఏంకే పార్టీ రాజకీయ వ్యవహారాలు అన్ని కూడా ఉదయనిది దగ్గరుండి చూసుకునేవాడు.
ఇక ఉదయనిది చివరిగా సైకో సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.ఈ సినిమా మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం అతను హీరోగా రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉండగా మరొకటి ప్రీప్రొడక్షన్ దశలో ఉంది.
అయితే తాజాగా జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం గత ఏడాది మొత్తం షూటింగ్ లు పక్కన పెట్టి పూర్తిగా రాజకీయ కార్యకలాపాల్లో ఉదయనిది నిమగ్నమయ్యాడు.
ఇక తాజాగా అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందాడు.ఇక తన తండ్రి స్టాలిన్ క్యాబినెట్ లో మంత్రి పదవి కూడా చేపట్టే అవకాశం ఉంది.
ఈ నేపధ్యంలో సినిమాలకి కొన్నేళ్ళ పాటు దూరంగా ఉండాలని ఉధయనిది స్టాలిన్ భావిస్తున్నట్లు తెలుస్తుంది.
పాలన, రాజకీయవ్యవహారాలతో బిజీగా ఉండే అవకాశం ఉన్నందున సినిమాలకి విశ్రాంతి ఇవ్వాలని అనుకున్తున్నాడని తమిళ్ రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.
అయితే ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న రెండు సినిమాలు పూర్తి చేసిన తర్వాత ఉదయనిది సినిమాల నుంచి తప్పుకుంటాడా, వాటిని పూర్తిగా పక్కన పెడతాడా అనేది ఆయన చెప్పే వరకు వేచి చూడాలి.
అల్లు అర్జున్ కాళ్ళ ముందు పడ్డ ఆస్కార్ అవార్డు విన్నర్ చంద్రబోస్ భార్య.. ఏమైందటే?