బీజేపీ పార్టీ పై సీరియస్ వ్యాఖ్యలు చేసిన ఉద్దవ్ ఠాక్రే..!!

మహారాష్ట్ర ముఖ్యమంత్రి శివసేన పార్టీ అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రే బీజేపీ పార్టీ పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.

హిందుత్వాన్ని అడ్డం పెట్టుకుని బీజేపీ దేశంలో అవకాశవాద రాజకీయాలు చేస్తోంది అని ఆరోపించారు.

శివసేన పార్టీ వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే 96వ జయంతి వేడుకలు సందర్భంగా.వర్చువల్ సమావేశంలో శివసేన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఉద్దవ్ ఠాక్రే ప్రసంగం చేస్తూ బీజేపీ పై మండిపడ్డారు.

దాదాపు 25 సంవత్సరాల పాటు బీజేపీతో కలసి.కాలం వృధా చేయటం జరిగిందని బాధపడ్డారు.

బీజేపీ హిందుత్వాన్ని ఉపయోగించుకుంది.కానీ మేము బీజేపీని వీడిన హిందూత్వం వదల లేదు అంటూ చెప్పుకొచ్చారు.

దేశంలో హిందుత్వాన్ని పెంచడానికి బీజేపీతో అప్పట్లో శివసేన పొత్తు పెట్టుకోవడం జరిగింది అని క్లారిటీ ఇచ్చారు.

ఇక ఇదే క్రమంలో అధికారం కోసం ఎప్పుడూ హిందుత్వాన్ని శివసేన ఉపయోగించు కోలేదని స్పష్టం చేశారు.

ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా వచ్చే ఎన్నికలలో శివసేన స్వతంత్రంగా పోటీ చేయాలని.

చాలెంజ్ చేశారు.అమిత్ షా చేసిన ఛాలెంజ్ స్వీకరిస్తున్నానని ఉద్దవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు.

మహారాష్ట్రలో మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా శివసేన పార్టీని విస్తరించేలా జరగబోయే ఎన్నికలలో పాల్గొనేలా వ్యవహరిస్తామని తెలిపారు.

ఇక ఇదే సమయంలో ఎక్కడ అయినా ఓడిపోతే.కార్యకర్తలు ఎవరు కూడా నిరాశ చెందవద్దని ఏదో ఒకరోజు గెలుస్తాం అంటూ ఉద్వేగంగా ఉద్దవ్ ఠాక్రే.

96వ బాల్ ఠాక్రే జయంతి వేడుకల్లో ప్రసంగించారు.

తన ఎలిగేటర్ తప్పిపోయిందట.. ఎంత కూల్‌గా చెబుతున్నాడో..?