చర్చనీయాంశంగా మారిన ఉదయనిధి స్టాలిన్ పోస్ట్..!
TeluguStop.com
డీఎంకే నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సోషల్ మీడియా వేదికగా పెట్టిన ఓ పోస్ట్ చర్చనీయాంశంగా మారింది.
దోమలను చంపేందుకు వాడే మస్కిటో కాయిల్ ఫొటోను పోస్ట్ చేశారు.అయితే ఈ పోస్టుకు ఎటువంటి క్యాప్షన్ ఇవ్వలేదు.
కానీ ఉదయనిధి స్టాలిన్ పెట్టిన పోస్ట్ ఇటీవల సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలను గుర్తుకు తెస్తుంది.
సనాతన ధర్మం డెంగీ, మలేరియా లాంటిదని, దాన్ని నిర్మూలించాలని ఉదయనిధి స్టాలిన్ పిలుపునివ్వగా దేశ వ్యాప్తంగా పెను దుమారం చెలరేగిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే స్టాలిన్ వ్యాఖ్యలపై మత పెద్దలు, బీజేపీ సహా మరికొన్ని పార్టీల నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి.
అయితే మస్కిటో కాయిల్ ను పోస్ట్ చేయడం ప్రస్తుత రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.
ఖాళీ కడుపుతో వీటిని తింటే చాలా డేంజర్..!