Uday Kiran Balakrishna: బాలయ్య, ఉదయ్ కిరణ్ కాంబోలో ఆగిపోయిన సినిమా ఇదే.. ఉదయ్ అన్ని రోజులు పని చేశాడా?

దివంగత హీరో ఉదయ్ కిరణ్( Uday Kiran ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఉదయ్ కిరణ్ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయినప్పటికీ ఆయన జ్ఞాపకాలు ఇంకా కళ్ళ ముందు మెదులుతూనే ఉన్నాయి.

అంతేకాకుండా ఇప్పటికీ ఆయన మరణ వార్తను అభిమానులు జీవించుకోలేకపోతున్నారు.తెలుగు సినీ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన ఒక రూపం ఉదయ్ కిరణ్.

చిత్రం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్ అతి తక్కువ సమయంలోనే వరుసగా సినిమాలలో నటించి భారీగా పాపులారిటీని సంపాదించుకున్నాడు.

ఆ తర్వాత నువ్వు నేను, మనసంతా నువ్వే ఇలా వరుసగా ఒకదాని తర్వాత ఒకటి బ్లాక్ బస్టర్ హిట్ లను అందుకున్నాడు ఉదయ్ కిరణ్.

అప్పట్లో లవర్ బాయ్ గా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు.అప్పట్లోనే ఉదయ్ కిరణ్ కు భారీగా లేడీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉండేది.

సినిమాల పరంగా బాగానే ఉన్నా వ్యక్తిగత జీవితంలో జరిగిన పరిణామాలు ఉదయ్ కెరియర్ పై ప్రభావాన్ని చూపించాయి.

దీంతో తీవ్ర మానసిక సంఘర్షణకు గురయ్యారు.పర్సనల్ లైఫ్ లో స్ట్రగుల్స్ కెరీర్‍లో ఒడిదుడుకులతో సతమతమయిన ఉదయ్ చివరకు ఆత్మహత్య చేసుకుని ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు.

2014 జనవరి 6న తన నివాసంలో ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే.

ఇది ఇలా ఉంటే తాజాగా జూన్ 26న ఉదయ్ కిరణ్ పుట్టిన రోజు.

( Uday Kiran Birthday ) """/" / ఈ సందర్భంగా ఉదయ్ కిరణ్‏కు సంబంధించిన అరుదైన ఫోటోలను ఆయన ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ క్రమంలోనే నందమూరి నటసింహం బాలకృష్ణతో( Balakrishna ) ఉదయ్ కలిసి దిగిన ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

దీంతో ఆ పిక్ ఏ సినిమా షూటింగ్ సమయంలోనిది అంటూ చర్చ మొదలైంది.

ఉదయ్ కిరణ్ కు బాలకృష్ణ నటించిన నర్తనశాల సినిమాలో( Nartanashala Movie ) నటించే ఛాన్స్ వచ్చింది.

2004 మార్చి 1న రామోజీ ఫిలిం సిటీలో వేసిన పర్ణశాల సెట్ లో ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యింది.

"""/" / ఇందులో భారీ క్యాస్టింగ్ కూడా ఉంది.ఈ చిత్రంలో బాలకృష్ణ , దివంగత నటి సౌందర్య ప్రధాన పాత్రలలో నటించారు.

అయితే సౌందర్య అకాల మరణంతో ఈ మూవీ షూటింగ్ ఆగిపోయింది.అన్ని పరిస్థితులు బాగుండి ఉంటే.

ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేది.ఇందులో దివంగత హీరో ఉదయ్ కిరణ్‏ను అభిమన్యుడి పాత్ర కోసం తీసుకున్నారు.

ఈ సినిమా షూటింగ్ సెట్‏లో అడుగుపెట్టినప్పుడు ఉదయ్ కిరణ్ బాలకృష్ణతో తీసుకున్న ఫోటో ఇది.

ఆ ఫోటోని చూసిన అభిమానులు బాధను వ్యక్తం చేస్తున్నారు.

చాక్లెట్ ప్లేన్‌గా ఉందని కస్టమర్ ఫిర్యాదు.. కంపెనీ అతనికి చెల్లించిన నష్టపరిహారం ఎంతంటే..?