తండ్రి స్కూల్ టీచర్.. 8 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన కొడుకు.. ఇతని సక్సెస్ కు హ్యాట్సాఫ్ అనాల్సిందే!

పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన వాళ్లకు లక్ష్యాలు సాధించే విషయంలో ఎన్నో ఇబ్బందులు, అవరోధాలు ఎదురవుతూ ఉంటాయి.

మధ్యతరగతి కుటుంబాలకు చెందిన యువత లక్ష్య సాధన కోసం ఎన్ని ఇబ్బందులు పడాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

అయితే ఉదయ్ హాసన్( Uday Hassan ) అనే యువకుడు మాత్రం ఏడాదిలో ఏకంగా ఎనిమిది ఉద్యోగాలను సాధించి వార్తల్లో నిలవడం గమనార్హం.

"""/" / ఖమ్మం జిల్లా మధిర( Madhira )కు చెందిన ఉదయ్ హాసన్ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు.

ఉదయ్ హాసన్ తండ్రి నాగేశ్వరరావు ప్రైవేట్ స్కూల్ లో టీచర్ గా పని చేస్తున్నారు.

ఇతని తల్లి సృజన కుమారి గృహిణి కావడం గమనార్హం.అంతంతమాత్రం సంపాదనతోనే తండ్రి కుటుంబాన్ని పోషించేవారు.

ఆ సమయంలో ఉదయ్ హాసన్ తాను ఉన్నత స్థాయికి చేరుకుంటే మాత్రమే ఈ పరిస్థితి మారే అవకాశం అయితే ఉంటుందని భావించాడు.

"""/" / 2022 సంవత్సరంలో బాసర ట్రిపుల్ ఐటీలో బీటెక్ పూర్తి చేసిన ఉదయ్ హాసన్ 2022లో ఎస్బీఐ పీవో పరీక్ష( SBI PO Exam)లో ఇంటర్వ్యూ వరకు వెళ్లినా తుది ఫలితాలు ఆశించిన విధంగా రాలేదు.

2023 సంవత్సరంలో ఎనిమిది నోటిఫికేషన్లు రాగా వీటిలో ఆర్.ఆర్.

బీ క్లర్క్, ఆర్.ఆర్.

బీ పీవో, ఏపీజీవీబీలో క్లర్క్, ఆర్బీఐ అసిస్టెంట్, ఎస్బీఐ పీవో, ఐబీపీఎస్ పీవో కెనరా బ్యాంక్, న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీలలో ఉద్యోగాలు సాధించానని తెలిపారు.

న్యూ ఇండియా అస్యూరెన్స్ సంస్థలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జాబ్ లో ఇటీవల చేరిపోయానని ఆయన పేర్కొన్నారు.

ఈ ఉద్యోగాలలో కొనసాగుతూనే ఆర్బీఐ గ్రేడ్ బి జాబ్ సాధించాలనే లక్ష్యంతో ఉన్నానని ఆ లక్ష్యాన్ని కూడా నెరవేర్చుకుంటానని ఉదయ్ హాసన్ చెప్పుకొచ్చారు.

ఉదయ్ హాసన్ చెప్పిన విషయాలు వైరల్ అవుతున్నాయి.ఉదయ్ హాసన్ తన టాలెంట్ తో కెరీర్ పరంగా అంతకంతకూ ఎదుగుతున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

గుర్తు పెట్టుకో.. వడ్డీతో సహా తిరిగొస్తుంది.. వైరల్ అవుతున్న నయన్ సంచలన పోస్ట్!