భారత సంతతి వ్యక్తికి తప్పిన భారీ ప్రమాదం...!!!

యూసఫ్ అలీ అంతర్జాతీయ వ్యాపార వేత్తగా విదేశాలలో తనకంటూ ఓ బ్రాండ్ ఇమేజ్ సంపాదించుకున్న వ్యక్తి.

అబుదాబిలో తన వ్యపారా సామ్రాజ్యాన్ని విస్తరించి అంచెలంచలుగా ఎదుగుతూ రెండు రోజుల క్రితం అబుదాబి యువరాజు చే అత్యున్నత పౌర పురస్కారం అందుకున్న ఏకైక భారత సంతతి వ్యక్తీ యూసఫ్ అలీ.

ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతూ, మరెన్నో స్వచ్చంద సంస్థలకు నిధులు అందిస్తూ అబుదాబి అభివృద్ధిలో తనదైన పాత్ర పోషిస్తూ భారతీయులు అందరూ గర్వించదగ్గ వ్యక్తీ అలీ.

యువరాజు చే పురస్కారం అందుకున్న తరువాత భారత్ లోని తన సొంత రాష్ట్రం కేరళా వెళ్ళిన అలీ అక్కడ స్థానికంగా ఓ ఆసుపత్రిలో అనారోగ్యంతో ఉన్న తన భంధువును చూడటానికి హెలికాప్టర్ లో వెళ్ళారు.

ఒక్క సారిగా వాతావరంలో భారీ మార్పులు రావడంతో అప్రమత్తమైన పైలెట్ ముదస్తూ జాగ్రత్తగా దగ్గరలోని మైదానంలో దించాలని భావించాడు.

కొంత దూరంలో కనిపిస్తున్న హైవే కి పక్కనే పచ్చిక బైళ్లలో హెలికాప్టర్ దించాలని భావించాడు.

దాంతో హెలికాప్టర్ ను పననగడ్ ఎన్ హెచ్ బైపాస్ సమీపంలోని దించాడు.

ఈ ప్రమాదం జరగకముందుగానే సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి వచ్చారు.

యూసఫ్ అలీ, ఆయన సతీమణి , మరో ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు పోలీసులు.

అయితే వారందరికీ ఎలాంటి హాని జరగలేదని, ఒకింత ఆందోళనకు లోనయ్యారని, మరో రెండు రోజుల్లో అబుదాబి బయలుదేరుతారని లులు గ్రూప్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రతినిధులు తెలిపారు.

ఈ ఘటనపై అబుదాబు యువరాజు షేక్ మహ్మద్ బీన్ ఆందోళన వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది.

రెండు రోజుల క్రితమే యువరాజు నుంచీ సేవా డిప్యూటీ సుప్రీం కమాండర్ గా అవార్డ్ అందుకున్నారు.

మొత్తం 11 మందికి ఈ అవార్డ్ అందించగా వారిలో యూసఫ్ అలీ భారతీయుడు కావడం గమనార్హం.

అజిత్ కొత్త కారు రేటు తెలిస్తే వామ్మో అనాల్సిందే.. కారు కోసం ఏకంగా ఇంత ఖర్చా?