ఏపీ వైపు దూసుకొస్తున్న మిచాంగ్ తుఫాన్..!
TeluguStop.com
బంగాళాఖాతంలో ఏర్పడిన మిచాంగ్ తుఫాన్ ఏపీ వైపుకు దూసుకొస్తుంది.ఈ క్రమంలో దక్షిణ కోస్తాంధ్ర తీరం వైపుగా తుఫాన్ పయనిస్తుంది.
మరికొన్ని గంటల్లో మిచాంగ్ తుఫాన్ తీవ్ర తుఫాన్ గా మారనుందని వాతావరణ శాఖ తెలిపింది.
నెల్లూరుకు సుమారు 250 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని పేర్కొంది.రేపు నెల్లూరు - మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది.
ఈ క్రమంలో తీరం వెంబడి బలమైన గాలులు వీచే అవకాశం ఉంది.దీంతో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు.
తుఫాన్ ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
కోస్తాంధ్రలో భారీ వర్ష సూచన ఉండగా మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టులకు అధికారులు ఏడవ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.
మిగిలిన పోర్టులకు మూడో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.తుఫాను కారణంగా గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి హైదరాబాద్, బెంగళూరు, తిరుపతి, కడప ఇండిగో విమానాలను అధికారులు రద్దు చేశారు.
అమీర్ ఖాన్ కొత్త సినిమా వచ్చేది అప్పుడేనా..?మన హీరోలను చూసి భయపడుతున్నాడా..?