శాస్త్రం ప్రకారం స్త్రీ, పురుషులు ఏ ఏ రోజుల్లో తలస్నానం చేస్తే ఆర్ధిక పరమైన సమస్యలు, ఆపదలు వస్తాయో తెలుసా?

స్త్రీలకు.తలస్నానం చేసిన రోజు ఎవరైనా ముత్తైదువ ఇంటికి వస్తే ఆమెకు నుదుటి బొట్టు పెట్టి పసుపు, కుంకుమ, మట్టి గాజులు దానం ఇస్తే శుభం జరుగుతుందని అంటారు.

మహిళలు తల స్నానం చేసే ముందు ఒంటికి నూనె, ముఖానికి పసుపు రాసుకుని,నలుగు పెట్టుకోవాలి.

భోజనానికి ముందే తలంటు స్నానం చేయాలి.ఇక ఇప్పుడు ఏరోజు తలస్నానం చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుందో తెలుసుకుందాం.

సోమవారం తలంటు చేస్తే నిత్య సౌభాగ్యంతో ఉంటారు.స్త్రీలు శుక్రవారం, మంగళవారం తలస్నానం చేయకూడదట.

తప్పదు అనుకుంటేనే శుక్రవారం, మంగళవారం తలస్నానం చేయాలి.స్త్రీలు బుధవారం తల స్నానం చేస్తే భార్యభర్తల మధ్య అన్యోన్యత మరింత పెరుగుతుంది.

స్త్రీలు శనివారం తల స్నానం చేస్తే ఐశ్వర్యం కలుగుతుంది.పురుషులు ఏ ఏ రోజుల్లో తలస్నానం చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో చూద్దాం.

సోమవారం తలంటు స్నానం అందం మరింత ద్విగుణీకృతమవుతుంది.మంగళవారం తలస్నానం విపరీత దుఃఖానికి కారణమవుతుంది.

బుధవారం తలం స్నానంతో లక్ష్మి దీవెనలు కలుగుతాయి.గురువారం తలంటు స్నానంతో ఆర్ధిక నష్టాలు విపరీతంగా కలుగుతాయి.

శుక్రవారం తలంటుకుంటే అనుకోని ఆపదలు సంభవిస్తాయి.పురుషులు శనివారం తల స్నానం చేస్తే మహా భోగం కలుగుతుంది.

ఆదివారం  తలంటు స్నానం చేస్తే తాపంతోపాటు ఆ కోరికలు పెరుగుతాయి.

కేరళలో అల్లు అర్జున్ కు మాత్రమే ఈ స్థాయిలో క్రేజ్ ఉండటానికి కారణాలివేనా?