వినాయకునికి ఈ పత్రితో పూజ చేయండి.. శనిదోషం తొలగించుకోండి..
TeluguStop.com
ఏదైనా మంచిపని ప్రారంభించే ముందు విఘ్నేశ్వరునికే తొలిపూజ చేస్తాం.గణనాధుడి పూజకు ముఖ్యంగా కావల్సింది గరిక.
ఎందుకంటే వినాయకుడికి గరిక అంటే చాలా ఇష్టం.గరికలో ఆధ్యాత్మిక ప్రయోజనాలతోపాటు ఆరోగ్య సూత్రాలు కూడా ఇమిడి ఉన్నాయి.
దేవతా మూలికగా పేరుపొందిన దూర్వారపత్రంలో తొమ్మిది రకాలున్నాయి.అందులో వినాయకుడి కోసం ఉపయోగించే గరిక ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే.
అయితే గరికతో పాటు ఏఏ పూలతో వినాయకుని పూజించాలా.ఎలాంటి ఫలితం ఉంటుంది.
శనిదోషం పోవడానికి ఏం చేయాలో తెలుసుకోండి. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
గరికతోపాటు గన్నేరు పూలను వినాయక చతుర్థి రోజున పూజకు ఉపయోగించడం వల్ల కష్టాలు తొలగిపోతాయి.
ఉదయం పూట తెల్ల గన్నేరు పూలతో శివుడు, గణేశుడికి అర్చన చేస్తే కోరుకున్నవి సిద్ధిస్తాయి.
సంస్కృతంలో అర్చక పుష్పం పేరుతో పిలిచే గరికతో విఘ్నేశ్వరుడిని పూజిస్తే సమస్త దోషాలు, విఘ్నాలు తొలగిపోతాయి.
ఇది సూర్యుడికి కూడా ప్రీతికరమైంది కావడంతో ఆరోగ్యం ప్రాప్తిస్తుందని పండితులు వివరిస్తున్నారు.అంతేకాదు గణేశుడికి దూర్వార పత్ర పూజ చేస్తే శనీశ్వరుడు వల్ల కలిగే కష్టాల నుంచి బయటపడతారు.
శనివారం నాడు శనిదేవుని గరికతో పూజిస్తే ఏలినాటి శని, అష్టమ శనిదోషాలు తొలగిపోతాయి.
మహాగణపతిని పూజించి, బెల్లం నైవేద్యంగా సమర్పిస్తే చేపట్టిన పనులు త్వరగా సానుకూలమవుతాయి.అదీ వినాయక చవితి రోజున గరిక పూజతో విశిష్ట ఫలితాలను పొందవచ్చు.
గరికపూసలతో వినాయకుడినే కాదు దుర్గాదేవిని కూడా పూజిస్తే ప్రార్థనలు ఫలిస్తాయి.వీటిని బీరువాల్లో, డబ్బులు దాచుకునే ప్రదేశాల్లో ఉంచితే ఆర్థిక ఇబ్బందులు ఉండవు.
మొండి బకాయిలు చేతికి అందుతాయి.గరికమాలను విఘ్నేశ్వరునికి సమర్పిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి.
వినాయక చతుర్థి నాడు 21 రకాల పత్రిలతో పూజ చేసినా అన్నింటికంటే ముఖ్యమైంది.
ఆయన ఎంతగానో మెచ్చింది దూర్వార పత్రమే.దీనితో పూజ చేసే వారికి గణపతి అనుగ్రహం తప్పక లభిస్తుంది.
అల్లు అర్జున్ భార్య ఆస్తుల విలువ ఎంతో తెలుసా.. వామ్మో అంత సంపదించారా?