రెండేళ్ల బాలుడి కిడ్నాప్.. కేసుని చేధించిన పోలీసులు..

రోజురోజుకూదారుణాలు ఎక్కువవుతున్నాయి.కిడ్నాప్ లు, అత్యాచారాలు, హత్యలు వంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి.

చిన్న పిల్లలను కిడ్నాప్ చేసి తల్లి దండ్రుల నుండి డబ్బులు గుంజడం లేదా చిన్న పిల్లలను అమ్మేయడం వంటివి చేస్తున్నారు.

పిల్లలను బయటకు పంపాలంటేనే భయపడాల్సి వస్తుంది.తెలియని వ్యక్తుల నుండి దూరంగా ఉండాలని పోలీసులు హెచ్చరించిన కొంతమంది నిర్లక్ష్యంతో వ్యవహరించడం వల్ల ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయి.

అలంటి ఘటనే ఇప్పుడు గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది.మంచినీళ్లు కావాలని అడిగి తల్లి లోపలికి వెళ్లి నీళ్లు తెచ్చేలోపు రెండు సంవత్సరాల పిల్లవాడిని ఆడుకుంటుండగా ఎత్తుకెళ్లారు.

తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ఈ కిడ్నాప్ కేసుని ఛేదించారు.

ఆ బాలుడిని క్షేమంగా తీసుకొచ్చారు.పూర్తి వివరాల్లోకి వెళ్తే.

గుంటూరు జిల్లా పెద్ద కాకాని మండలం నంబూరు సమీపంలోని కాలనీలో బాల, ముసలయ్య అనే దంపతులు నివాసముంటున్నారు.

వారికి రెండు సంవత్సరాల కొడుకు కూడా ఉన్నాడు.ఫిబ్రవరి 24 వ తారీఖున సాయంత్రం సమయంలో వీళ్ళ ఇంటి సమీపంలో కారులో ఇద్దరు వ్యక్తులు అక్కడికి వచ్చారు.

వారు మంచినీళ్లు కావాలని అడగడంతో బాల కొడుకు జీవా అడ్డుకుంటున్నాడని బయటే వదిలేసి మంచినీళ్లు తెచ్చేందుకు లోపలికి వెళ్ళింది.

మంచినీళ్లు తీసుకుని బయటకు వచ్చేసరికి కారులో వచ్చిన ఇద్దరు వ్యక్తులు, అలాగే ఆమె కొడుకు జీవా కూడా కనిపించలేదు.

దీంతో కంగారుపడి తన భర్తకు విషయం చెప్పడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసాడు.

పోలీసులు మిస్సింగ్ కేసును నమోదు చేసుకుని ఏడూ బృందాలుగా ఏర్పడి ఆ బాబును వెతకడం ప్రారంభించారు.

సీసీ కెమెరాల సహాయంతో ఆ నిందితులను వెతికి పట్టుకున్నారు.నిందితులు విజయవాడలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసారు.

వాళ్ళను విచారించగా బాబును వేరే వాళ్లకు అమ్మేశామని చెప్పారు.వారు జీవాను తూర్పు గోదావరి జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలో నివసించే ఒక జంటకు అమ్మేసినట్లు తెలిపారు.

ఆ దంపతులు జీవాను లక్ష అరవై వేల రూపాయలకు కొనుగోలు చేసినట్లు తెలియడంతో ఆ దంపతులను, మధ్య వర్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

బాల, ముసలయ్య దంపతుల రెండు సంవత్సరాల జీవాను వారికీ క్షేమంగా అప్పజెప్పడంతో ఆ దంపతులు ఆనందం వ్యక్తం చేసారు.

ప్రభాస్ కి అంత క్రేజ్ ఉండటానికి గల కారణం ఏంటంటే..?